Home »
Gossips
» "వెల్‌కమ్ బ్యాక్ నయనతార" అని రాస్తే ఇక మామధ్య అదున్నట్టేనా: ఆర్య
"వెల్‌కమ్ బ్యాక్ నయనతార" అని రాస్తే ఇక మామధ్య అదున్నట్టేనా: ఆర్య
నయనతార విషయంలో ఆర్య చాలా ఇంట్రస్ట్‌గా ఉన్నాడని వార్తలు వచ్చాయి. ప్రభుదేవాతో దూరమయిన తర్వాత ఆమెను అందరూ ఆదరిస్తున్నారు. ఆ ఆదరణ రకరకాలుగా ఉంటుంది. ఆర్య కాస్త ముందగుడుగు వేశాడు. ఈ ముందడుగు కాస్త ముదిరి నయనతారతో మరీ ఇదిగా మారిందని అంటున్నారు. ఇదంటే.. అదేనండీ లవ్. నయనతార మరోసారి ఆర్యతో ప్రేమలో పడింది అంటున్నారు. కానీ ఆర్య మాత్రం కొట్టిపారేస్తూ అందరూ చెప్పే మాటలే చెబుతున్నాడు. తామిద్దరం కేవలం స్నేహితులం మాత్రమే అంటున్నాడట. ఇద్దరం 'బాస్ ఎన్గిర భాస్కరన్' (తెలుగులో నేనే అంబానీ) చిత్రంలో నటించామనీ అప్పట్నుంచి స్నేహితులుగానే ఉన్నాని నొక్కి చెప్పాడు. అదిసరే... ఇటీవలే 'వెల్‌కమ్ బ్యాక్ నయనతార' అనే కేక్ వెనుక కథేమిటి? అని ప్రశ్నిస్తే... ఆ రోజు మా గృహప్రవేశం వేడుక. నయనతోపాటు పలువురిని ఆహ్వానించాను. ఆమె కొన్ని ఇబ్బందుల్లో ఉంది. మళ్ళీ తేరుకుని సినిమాలు చేయాలని అలా రాశానంతే అంటూ సమాధానమిచ్చాడు. నమ్మేద్దామా...
Post a Comment