Pages

Tuesday, 8 May 2012

దిల్ రాజుకు మహేష్ దడదడ... రాజమండ్రిని రామోజీకి తెప్పించిన ప్రిన్స్

నిర్మాత దిల్‌రాజు హీరోలతో సినిమా చేస్తే.. తను చెప్పినట్లే వినేట్లు చేసుకుంటాడు. దర్శకత్వంలో జోక్యం చేసుకునే సిద్ధార్థ్ లాంటివాడినే లైన్‌లో పెట్టి.. బొమ్మరిల్లు చిత్రాన్ని తనకు కావాల్సినట్లుగా తీసుకున్నాడు. అలాగే ప్రకాష్‌రాజ్‌ విషయంలో కూడా దిల్‌రాజు తీసుకున్న స్టెప్ట్స్‌ ఆయనకు కలిసి వచ్చాయి. అందుకే ఆయనతో చిత్రాలు చేయడమంటే.. అన్ని తెలిసిన వాళ్ళు పెద్దగా జోక్యం చేసుకోరు.

ఆయన ఎక్కడ షూటింగ్‌ చేయాల్సి వస్తే.. అక్కడే చేయాల్సి ఉంటుంది. అనవసరపు ఖర్చులు పెట్టడు. సింపుల్‌గా సినిమాను లాంగించేస్తాడు. అవసరమైతే రీష్యూట్‌ కూడా చేయడానికి వెనకడుగు వేయడు.

కానీ, మహేష్‌బాబు విషయంలో దిల్‌రాజు ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా ఆయన వెంకటేష్‌, మహేష్‌బాబుతో 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది భారీ బడ్జెట్‌ చిత్రం. ఈ చిత్రంలో మహేష్‌బాబు పార్ట్‌ కొంతమేరకు రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తీయాల్సి ఉంది. కానీ అక్కడ దిల్‌రాజు చేయడానికి సిద్ధమైనా.. మహేష్ బాబు రావడానికి సాధ్యపడదని తేల్చి చెప్పేశాడు. అక్కడ ఉన్న సీన్స్‌ అన్నీ సెట్‌లా వేసేసి తీయండని చెప్పేశాడు.

చేసేది లేక రామోజీ ఫిలింసిటీలో పెద్ద సెట్‌ వేసి రాజమండ్రిని హైదరాబాద్‌కు రప్పిస్తున్నాడు దిల్. దీనికి కారణం లేకపోలేదు. మహేష్‌బాబు భార్య నమ్రతా గర్భవతి. తను సాయంత్రానికల్లా ఇంటికి వెళ్లిపోయాలి. ఆమె దగ్గరే ఉండాలనీ కనుక రాజమండ్రి రావడం సాధ్యపడదని చెప్పేసరికి సెంటిమెంట్‌గా ఫీలయి దిల్‌రాజు సెట్‌ వేయడానికి రెడీ అయ్యాడు. అదీ సంగతి.

No comments:

Post a Comment