గులాబీ పూల రెక్కల మకరందం ఆమె అందం. తేనె చుక్కల్లాంటి మధురం ఆమె నవ్వు. కోటేరు ముక్కుపైన చిలిపి కళ్లు.. సినీ ప్రేక్షకుల కోసం దివి నుంచి భువికి దిగివచ్చిన అతిలోక సుందరి శ్రీదేవి. భారత చలన చిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన శ్రీదేవి దాదాపు నాలుగు దశాబ్దాలు చిత్ర పరిశ్రమను ఏలింది.
లెక్కకుమించిన అగ్ర హీరోలతో హిట్ సినిమాలు చేసిన శ్రీదేవి... గత కొంతకాలంగా చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. బోనీ కపూర్‌ను వివాహం చేసుకుని ఓ ఇంటికి కోడలైంది. దాదాపు భారతీయ చిత్ర పరిశ్రమకు దూరమైన శ్రీదేవి.... ఇప్పుడు తన కుమార్తె జాహ్నవిని వెండితెరకు పరిచయం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఇందులోభాగంగా.. గతంలో చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమా రీమేక్ చేయాలనుకున్న శ్రీదేవి ఈ విషయాన్ని చిరుకు కూడా తెలిపింది. దీనికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. రామ్ చరణ్ , జాహ్నవి కాంబినేషన్‌తో భారీ మూవీ తీసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. చూద్దాం.. యువజంట కాంబినేషన్‌లో వచ్చే 'జగదేక వీరుడు.. అతిలోక సుందరి' ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో.!!

Post a Comment