గోపీచంద్‌కు గోతులు తవ్వుతున్నారా...?
సినిమారంగంలో మంచోళ్లు, చెడ్డోళ్లు ఉంటారనేది తెలిసిందే. ఒక హీరో దగ్గర పనిచేసిన వారే మరో హీరో దగ్గర పనిచేస్తుంటారు. ఇక్కడ విషయాలు అక్కడా.. అక్కడవి ఇక్కడా చెబుతుంటారు. ఇది ఇండస్ట్రీ నైజం. ప్రస్తుతం గోపీచంద్‌కు అదే పెద్ద మైనస్ అయింది. హీరోగా గోపీతో చేస్తే సినిమా గోవిందే.. అంటూ ప్రచారం జరుగుతోంది. దాంతో అగ్ర నిర్మాతలెవరూ ఆయనతో సినిమాలు తీయడానికి ముందుకు రావడంలేదట. పైగా ఇటీవలి కాలంలో సక్సెస్‌లు కూడా లేవు. విలన్‌గా అయితేనే ఆయన చాలా బెటర్... సినిమా ఆడుతాయనే నానుడి ఉంది. దీంతో గోపీచంద్ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజగా కెరీర్‌ను మౌల్డ్ చేయడానికి ప్లాన్‌లు వేస్తున్నాడు. నయనతారతో కలిసి సినిమా చేస్తున్నాడు. అది హిట్ అయితే వారి నోళ్లు మూయిస్తానని అంటున్నాడు.
Post a Comment