"అధినాయకుడు"ను ఆపే అధికారం మాకు లేదు: భన్వర్‌లాల్ స్పష్టం
అధినాయకుడు సినిమాలో అభ్యంతరకర సంభాషణలున్నాయంటూ ఎన్నికల సంఘానికి అందిన ఫిర్యాదుపై భన్వర్ లాల్ స్పందించారు. ఈ చిత్రాన్ని విడుదల కాకుండా ఆపే అధికారం తమకు లేదని స్పష్టం చేశారు. ఏవైనా అభ్యంతరకరమైన విషయాలుంటే దానిని ఆపే అధికారం సెన్సార్ బోర్డుకే ఉంటుందని అన్నారు. కాకపోతే ఈ సినిమా ఎన్నికల ప్రచారం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించిన మీదట దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. చిత్రాన్ని చూసిన తర్వాత నిపుణుల కమిటీ దీనిపై ఓ నివేదిక అందజేస్తుందని తెలిపారు. కాగా ఈ చిత్రంలో విగ్రహాల ప్రతిష్టాపనపై పంచ్ డైలాగుతోపాటు మరికొందరు నాయకులను టార్గెట్ చేస్తున్నట్లుగా వ్యాఖ్యలున్నట్లు సమాచారం. ఈ చిత్రం జూన్ 1న రాష్ట్ర వ్యాప్తంగా విడుదలవుతోంది.
Post a Comment