Pages

Monday, 7 May 2012

ఫీల్డులో ఎలా ఉండాలో చెల్లికి చెపుతుంటా: కాజల్‌

కాజల్‌ ఇప్పుడు హీరోలకు ఫేవరేట్‌ హీరోయిన్‌. ఆమె డేట్స్‌ కోసం హీరోలు, దర్శకులు ఎదురుచూస్తుంటారు. 'బిజినెస్‌మేన్‌' తర్వాత మంచి ఫామ్‌లోకి వెళ్ళిపోయింది. ఏ పాత్ర అయినా దానికి న్యాయం చేస్తాం. లక్ష్యమంటూ మనిషికి ఉండాలి. లేదంటే చేసేదానిలో కిక్‌ ఉండదు. ఏదో చేసుకుంటూ పోవడం మినహా ప్రత్యేకత ఉండదని చెబుతోంది.

మరి ఇవన్నీ...మీ సోదరి నిషాకు చెప్పారా? అని అడిగితే... అదే నాకు చెప్పే స్థాయికి చేరుకుందని నవ్వుతుంది. ఇటీవలే నిషా నిర్మాతల్ని పారితోషికం విషయంలో డిమాండ్‌ చేస్తుందనీ, దానికి మీరు క్లాస్‌ తీసుకున్నారని తెలిసిందని అడిగితే.... మేమిద్దరం రోజూ కలుస్తుంటాం.

తీరిక ఉంటే కలిసి భోజనం చేస్తాం. కానీ పెద్దగా మనస్పర్థలు లేవు. సినిమా ఫీల్డులో ఎలా ఉండాలి... అనే విషయాలు చెబుతుంటాను. ఆచరిస్తుంటుంది. ఇందులో తేడాలు ఏమీలేవు... అని చెప్పింది కాజల్.

No comments:

Post a Comment