పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘గబ్బర్ సింగ్’ విడుదలకు ముందే బిజినెస్ అదిరిపోతోంది. తాజాగా ఈ చిత్రాన్ని ‘ఇష్క్’ చిత్రం డిస్ట్రిబ్యూటర్స్ ‘శ్రీ వెంకటేశ్వర్ ఫిల్మ్స్’వారు భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకున్నారు. ట్రేడ్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం చిత్తూరు, కర్నలు, బల్లారి రైట్స్‌ను ఈ సంస్థ రూ. 3.60కోట్లు చెల్లించి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈచిత్రం ఆడియో మంచి విజయం సాధించడంతో పాటు ట్రైలర్లు కూడా అదిరిపోవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగి పోయాయి. ప్రస్తుతం గబ్బర్ సింగ్ షూటింగ్ పాటల చిత్రీకరణతో సహా మొత్తం పూర్తయింది. మే 10న ఈచిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.

Post a Comment