కర్నూలు లక్ష్మీ థియేటర్‌లో 'మగధీర' వెయ్యి రోజులు!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, సంచలన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మించిన భారీ బడ్జెట్ చిత్రం 'మగధీర'. ఈ చిత్రం 209 జులై 31వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రం విడుదలైన నాటి నుంచి నేటి వరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులతో పాటు వివాదాలను సృష్టించింది. ముఖ్యంగా అత్యధిక వసూళ్లు సాధించి పాత రికార్డులు తిరగరాసింది. ఇపుడు.. కర్నూలులోని లక్ష్మీ థియేటర్‌లో 26వ తేదీ నాటికి నాటికి వెయ్యి రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుని సరికొత్త రికార్డు సాధించింది. దీంతో వెయ్యి రోజుల వాల్‌పోస్టర్‌ను చిత్ర థియేటర్ యాజమాన్యం తాజాగా విడుదల చేసింది. ఈ చిత్రం 40 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించగా సుమారు 80 కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు వసూలు చేసినట్టు టాలీవుడ్ వర్గాల కథనం. ఇదే ఏడు దశాబ్దాల తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లుగా చెప్పుకుంటున్నారు.
Post a Comment