ఆయన దర్శకత్వంలో చేయడం ఎక్సయింట్‌మెంట్‌నివ్వడంలేదు. సరికదా చాలా భయంగా ఉంది.ఆయన అంచనాలకు తగ్గట్టుగా యాక్ట్ చేయగలుగుతానా..లేదా అని టెన్షన్ అంటోంది సమంత. ఇదంతా సమంత... మణిరత్నం గురించి చెప్తోంది. మణరత్నం దర్శకత్వంలో ఆమె హీరోయిన్ రూపొందుతున్న చిత్రం ‘కడల్’. ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.అలాగే ..మణిసార్ దర్శకత్వంలో నటించాలనే నా కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది అంది.
అరవింద్ స్వామి కీ రోల్ లో చేస్తున్న ఈ చిత్రానికి ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నాడు. రాజీవ్ మీనన్ కెమెరా వర్క్, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ నిర్వహించనున్నారు. సమంత సరసన తమిళనటుడు కార్తీక్ కుమారుడు గౌతమ్ నటించనున్నాడు. కార్తీక్ ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. మణిరత్నం సినిమా అంటే తమిళంతో పాటే తెలుగులో కూడా విడుదలవ్వనుంది.
‘కడలి’ టైటిల్ తో ఈ చిత్రం తెలుగు లో రిలీజ్ అవుతుంది. ఈ విషయమై సమంత స్పందిస్తూ..‘‘మణి సార్ డెరైక్షన్‌లో నటించాలనేది నా కల మాత్రమే కాదు. ఇండియాలోని ప్రతి ఆర్టిస్ట్ కల. ఆ శుభ ఘడియ నాకు ఇంత త్వరగా వస్తుందని నేను ఊహించలేదు. దీన్ని గాడ్ గిప్ట్ గా భావిస్తున్నాను. తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగినా కలగని ఆనందం మణి సార్ సినిమాలో చేస్తున్నందుకు కలిగింది’’అంది. ఇక సఖి తర్వాత మణిరత్నం రూపొందిస్తున్న ఈ చిత్రంపై అప్పుడే అందరిలో క్యూరియాసిటీ మొదలైంది.
ప్రస్తుతం సమంత చిత్రాలు వరుసగా రెడీ అవుతున్నాయి. నాగచైతన్య' ఆటోనగర్ సూర్య' ' రామ్ చరణ్ ' ఎవడు' మణిరత్నం ' కాదల్' గౌతమ్ మీనన్ ' ఎటు వెళ్లిపోయిందో మనసు' త్వరలో విడుదల కానున్నాయి. నిర్మాతలకు ఆమె మీద పెట్టుబడి పెడితే లాభాలకు ఇబ్బంది ఉండదనే నమ్మకం ఆమెను తమిళ,తెలుగు భాషల్లో బిజీ చేస్తోంది. ప్రస్తుతం ఆమె మహేష్ సరనస చేస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు,సిద్దార్ద సరసన నందినీ రెడ్డి దర్శకత్వం షూటింగ్ లోనూ రెగ్యులర్ గా పాల్గొంటోంది. అడపా దడపా ఆమె యాడ్ ఫిల్మ్ లు కూడా చేస్తోంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment