Pages

Tuesday, 1 May 2012

సెక్సీ ఐటమ్‌గా మారనున్న హోమ్లీ బ్యూటీ సదా!

హోమ్లీ బ్యూటీ సదా సెక్సీ ఐటమ్‌గా మారనుంది. తేజ జయం సినిమా ద్వారా తెలుగు సీమకు పరిచయమైన సదా కోలీవుడ్‌లో ఐటమ్‌ గర్ల్‌గా అలరించనుంది. సెక్సీ హీరోయిన్‌గా ముద్ర వేసేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా, మార్కెట్లో అమ్మడుకు ఆఫర్లు రాకపోవడంతో ఐటమ్ గర్ల్‌గా మారనుందని సినీ వర్గాల్లో టాక్.

కొత్తి సినిమాల్లో హీరోయిన్ ఛాన్సులు రాకపోవడంతో కాస్త నిరాశకు గురైన సదా చిన్న చిన్న రోల్స్ చేసేందుకు కూడా ప్రస్తుతం సై అంటోంది. అయితే ఆ పాత్రలు కూడా కరువవడంతో తన పేరును ప్రేక్షకులు మరిచిపోతారమోనని, ఇందుకు ఐటమ్ గర్ల్‌గా గ్లామర్‌ను పంట పండించడమే ఉత్తమమైన మార్గమని సదా భావిస్తోంది. ఈ క్రమంలో సెక్సీ డాన్సర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుని తిరిగి సినీ ఛాన్సులు కైవసం చేసుకోవాలని ఈ భామ అనుకుంటోంది.

తాజాగా తెలుగులో శివాజీ సరసన నటిస్తున్న సదా.. తమిళంలో సి సుందర్ దర్శకత్వం వహించే "కలకలప్పు" అనే చిత్రంలో ఐటమ్ గర్ల్‌గా కనిపించనుందట. ఇంకేముంది.. ఈ ఐటమ్ సాంగ్‌ అయినా సదాకు టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందో లేదో వేచి చూడాల్సిందే.

No comments:

Post a Comment