ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్ లో ‘బాద్ షా’ అనే చిత్రం రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఈ చిత్రం బిజినెస్ అప్పుడే మొదలైపోయింది. నెల్లూర్ రైట్స్ ని శ్రీ నికేతన్ ఫిల్మ్స్ వారు తీసుకున్నామని కన్ఫర్మ్ చేసారు. గబ్బర్ సింగ్ కు కూడా మొదట వారే డిస్ట్రిబ్యూటర్ గా కన్ఫర్మ్ చేసారు. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో గణేష్ తను నిర్మిస్తున్న బాద్షాకి కూడా అదే డిస్ట్రిబ్యూటర్స్ చేత బిజినెస్ ప్రారంభించాడు. సెంటిమెంట్ గా ప్రారంబించిన దీనికి నామినల్ అడ్వాన్స్ ఆ ఏరియా నుంచి వచ్చింది. నెగేషియేషన్స్ తర్వాత జరగుతాయి. జూన్ మొదటి వారంలో ఈ చిత్రం సెట్స్ కు వెళ్లనుంది.
తొలి షెడ్యూల్ ను ఏకధాటిగా 50 రోజుల పాటు ఇటలీలో ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. జూ ఎన్టీఆర్-కాజల్ కాంబినేషన్లో ఇప్పటికే బృందావనం లాంటి హిట్ సినిమా రావటంతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఫ్యామిలీ అండ్ హిల్లేరియస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈచిత్రానికి తమన్ సంగీతం అందించనున్నాడు.
ఇప్పటికే రెడీ, దూకుడు లాంటి చిత్రాలతో మంచి క్రేజ్ సంపాదించుకున్న శ్రీను వైట్ల ఈ సారి అంతకు మించిన ఎంటర్ టైన్మెంట్ సబ్జెక్టుతో ‘బాద్ షా’ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. దూకుడు చిత్రానికి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు తమన్ తో పాటు చాలా మంది టెక్నీషియన్స్ ‘బాద్ షా’ చిత్రానికి పని చేస్తున్నారు. ఈ సినిమా మరో దూకుడు అవుతుందని,ఆ రేంజిని దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ సైతం ఈ చిత్రంపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... సినిమా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది అన్నారు. శ్రీను వైట్ల, ఎన్టీఆర్ కాంబినేషన్ అంటే జనం రకరకాలు అంచనాలు వేస్తున్నారు. వాటినన్నిటికీ అతీతంగా కథ,కథనం ఉంటాయి. పూర్తిగ మొదటినుంచి చివరి వరకూ పొట్ట పగిలేలా నవ్విస్తాము అన్నారు. గబ్బర్ సింగ్ తో సూపర్ హిట్ కొట్టిన గణేష్, దూకుడుతో సూపర్ హిట్ కొట్టిన శ్రీనువైట్ల కాంబినేష్ కాబట్టి తమకీ ఆ రేంజి హిట్ పడుతుందని ఎన్టీఆర్ పూర్తి నమ్మకంగా ఉన్నారు. ట్రేడ్ లో సైతం ఆ నమ్మకంతో హైప్ క్రియేట్ అవుతోంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment