.
Home » , » విశ్వరూపం'లో కమల్ పాత్రేంటి?

విశ్వరూపం'లో కమల్ పాత్రేంటి?

Written By Hot nd spicy on Thursday, 3 May 2012 | 10:33

కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ రీసెంట్ గా విడుదల చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంతర్జాతీయ తీవ్రవాదం నేపథ్యంగా సాగే కథాంశంతో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ఇప్పటికే షూటింగ్ పూర్తైంది. కమల్‌ ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఈ చిత్రం కోసం ఆయన ప్రత్యేకంగా పండిట్‌ బిర్జూ మహారాజ్‌ దగ్గర కథక్‌ నృత్యం నేర్చుకొన్నారు. కథలో ఆ నృత్యం కీలకమని సమాచారం.
రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. తమిళంతోపాటు తెలుగు, హిందీ భాషల్లోనూ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దాదాపు రూ.150 కోట్ల వ్యయంతో ఇది తెరకెక్కింది. ఈ వేసవిలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ప్రముఖ దర్శకులు శేఖర్‌ కపూర్‌ ఈ చిత్రంలో ఓ పాత్ర పోషించారు. కథలో ఆ పాత్ర కీలకమై సినిమాను మలుపు తిప్పుతుందని చెప్తున్నారు.

ఇక కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ లో తానే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా ఎంపిక చేసారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా ఎంపిక చేసిన ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ చిత్రమే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.


ఈ చిత్రాన్ని కమల్ మొదట సెల్వ రాఘవన్ దర్శకత్వంలో రూపొందించాలనుకున్నారు. కానీ చివరి నిముషంలో విభేదాలు రావటంతో తానే దర్సకత్వం చేసారు. రాత్రింబవళ్లూ కష్టపడి ఈ చిత్రం ఓ మాస్టర్ ఫీస్ లా తీర్చిదిద్దాడని చెప్తున్నారు. గతంలోనూ కమల్ కొన్ని సినిమాలకు దర్సకత్వం వహించి ఉండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. పూజా కుమార్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు నటించారు. సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger