Home »
Gossips
» డిపార్ట్‌మెంట్ షూటింగ్‌లో సంజయ్ బాగా వేధించాడు : వర్మ
డిపార్ట్‌మెంట్ షూటింగ్‌లో సంజయ్ బాగా వేధించాడు : వర్మ
బాలీవుడ్ చిత్రం డిపార్ట్‌మెంట్ షూటింగ్ సందర్భంగా హీరో సంజయ్ దత్‌తో పాటు.. అతని ప్రొడక్షన్ సీఈఓ ధరమ్ ఓబెరాయ్‌లు తనను బాగా వేధించారంటూ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ బ్లాగులో కామెంట్స్ పోస్ట్ చేశాడు. అందుకే.. ఇకపై ఈ జన్మకు సంజయ్ దత్ ముఖం చూడకూడదని ప్రతినపూనినట్టు పేర్కొన్నాడు. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, సంజయ్‌దత్, దగ్గుబాటి రానా, మంచు లక్ష్మి, మధుశాలినిలు జంటగా నటించిన చిత్రం 'డిపార్ట్‌మెంట్'. ఈ చిత్రాన్ని 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించగా, ప్రేక్షకులను మెప్పించలేక బాక్సాఫీస్ వద్ద చతికిల పడింది. ఈ చిత్ర పరాజయం నుంచి తేరుకోకముందే.. రామ్ గోపాల్ వర్మ తనకు జరిగిన అవమాన భారాన్ని బహిరంగ పరిచారు. షూటింగ్ సమయంలో స్క్రిప్ట్‌ను మార్పు చేయాల్సిందిగా, కంగనా రనౌత్‌ను తీసుకోవాల్సిందిగా సంజయ్ దత్ తీవ్రమైన ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు. సంజయ్‌తో పని చేయడం దారుణమైన అనుభంగా పేర్కొన్నారు.
Post a Comment