రామ్ చరణ్ రచ్చ చిత్రంతో తానేమిటో ప్రూవ్ చేసుకున్న సంపత్ నంది...తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ సారి సంపత్ నంది ..అల్లు అర్జున్ తో చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వన్ లైన్ ఆర్డర్,స్టోరీ విన్న బన్ని మరిన్ని మార్పులు తెలిపాడని,మాస్ మసాలా చిత్రంగా రూపొందించటానకి సంపత్ నంది సన్నాహాలు చేస్తున్నట్లు గా చెప్తున్నారు. రచ్చ చిత్రం యావరేజ్ రేంజి కావటంతో స్పీడుగా బయిటనుంచి ఆఫర్స్ రాని సంపత్ నంది..మాస్ డైరక్టర్ గా పెద్ద హీరోలను డైరక్ట్ చేయగల సత్తా ఉన్నవాడుగా ప్రూవ్ చేసుకున్నాడు.
రచయితగా ఇండస్ట్రీలో ప్రవేసించిన సంపత్ నంది ఘోస్ట్ గా,స్టైయిట్ రైటర్ గా దాదాపు ముప్పై పైన చిత్రాలుకు రచన చేసారు. ఉపేంద్ర హీరోగా కన్నడంలో ఓ చిత్రం సైతం రూపొందించారు. అలాగే మొదటి చిత్రం తెలుగులో ఏమైంది ఈ వేళ చేసారు. వరుణ్ సందేశ్ హీరోగా చేసిన ఈ చిత్రం అమీర్ పేట లేడీస్ హాస్టల్స్ కల్చర్ చుట్టూ తిరుగుతుంది. ఆ చిత్రం తర్వాత కథ పట్టుకుని రామ్ చరణ్ ని ఒప్పించి మెగా సూపర్ గుడ్ బ్యానర్ లో రచ్చ చిత్రం చేసాడు. అయిత ఈ సినిమా ఓకే అనిపించుకుని,దర్సకుడుకి అనుకున్నంత పేరుని తేలేకపోయింది. దాంతో ఆఫర్స్ అతనిని ఓవర్ నైట్ లో చుట్టుముట్టలేదు. దాంతో మళ్లీ కథ రెడీ చేసుకుని అల్లు అర్జున్ ని కలిసినట్లు సమాచారం.
ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ జులాయి చిత్రం బిజీలో ఉన్నాడు. ''జీవితాన్ని తేలిగ్గా తీసుకొనే యువకుడి చుట్టూ మా 'జులాయి' కథ తిరుగుతుంది. వినోదం, యాక్షన్ అంశాలు సమపాళ్లలో ఉంటాయి. త్రివిక్రమ్ శైలి సంభాషణలు, అర్జున్ నృత్యాలు అలరిస్తాయని''అన్నారు నిర్మాత ఎస్.రాధాకృష్ణ. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'జులాయి' ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్, ఇలియానా జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు.
అలాగే కథానుగుణంగానే కాక, పాత్రోచితంగా కూడా ఈ చిత్రానికి ‘జులాయి’ పేరే సరైనది అని దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్ణయించారు. ఇందులో త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ ప్రేక్షకుల్లోకి బుల్లెట్స్‌లా దూసుకుపోతాయని, అవి అల్లు అర్జున్ నోట ఆటంబాంబుల్లా పేలతాయని సమర్పకుడు డీవీవీ దానయ్య చెబుతున్నారు. ''అర్జున్ శైలి నటన, నృత్యాలు ప్రధాన ఆకర్షణ. ఈ సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రత్యేకంగా ఓ సెట్‌ని నిర్మిస్తున్నాము. త్రివిక్రమ్ టేకింగ్, బన్నీ ఎనర్జీ, ఇలియానా అందం, రాజేంద్రప్రసాద్ అభినయం, దేవిశ్రీ సంగీతం మా ‘జులాయి’ చిత్రానికి హైలైట్‌గా నిలువనున్నాయి. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, సోనుసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తులసి, ప్రగతి, హేమ తదితరులు నటిస్తున్నారు. సంగీతం: దేవిశ్రీ ప్రసాద్.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment