టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘దూకుడు’ చిత్రం 2011 సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే 100 రోజులు పూర్తి చేసుకున్న ఈచిత్రం తెలుగు సినిమా పరిశ్రమ గర్వించదగ్గ పెద్ద హిట్లలలో ఒకటిగా నిలిచింది. మహేష్ బాబు పూర్తి స్థాయి ఎనర్జీతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేశారు.
ఈ చిత్ర నిర్మాత ఈ చిత్రానికి సంబంధించిన 100 రోజుల వేడుకను జూన్ నెలలో గ్రాండ్‌గా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే వేదిక ఎక్కడ అనేది ఇంకా ఖరారు కాలేదు. ఈ గ్రాండ్ ఈవెంటుకు సినిమాలో నటించిన ఆర్టిస్టులందరితో పాటు సినిమా విజయవంతానికి తెర వెనక ఉండి కృషి చేసిన టెక్నీషియన్స్, ఎగ్జిబిటర్స్ హాజరు కానున్నారు.
హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీను వైట్ల, హీరోయిన్ సమంత ఈ వేడుకకు హాజరై అభిమానులను ఉత్సాహ పరుచనున్నారు. 14రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థకు అందిన మొట్ట మొదటి భారీ హిట్ కావడంతో ఈ వేడుకను భారీ ఎత్తున నిర్వహించేందుకు నిర్మాతలు అనిల్ సుంకర్, రామ్ ఆచంట, గోపీ చంద్ ఆచంటలు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాం.
Post a Comment