.
Home » » స్నేహా ఉల్లాల్ బాలీవుడ్ ప్రయత్నాలు!

స్నేహా ఉల్లాల్ బాలీవుడ్ ప్రయత్నాలు!

Written By Hot nd spicy on Sunday, 1 April 2012 | 06:44

జూనియర్ ఐశ్వర్యారాయ్ అంటూ పేరు తెచ్చుకున్న స్నేహా ఉల్లాల్ ఆశించిన రీతిలో తెరమీద రాణించలేకపోతోంది. చూపులకు ఐశ్వర్య మాదిరిగా ఉండటం వల్లే సల్మాన్ ఖాన్ ఆమెని 'లక్కీ' సినిమాలో తన సరసన నటింపజేయడం ద్వారా ఆమెని బాలీవుడ్‌కు పరిచయం చేశాడు. అయితే ఆ సినిమాతో పాటు, ఇతర సినిమాలేవీ స్నేహకు పేరు తేలేదు. దాంతో లాభం లేదనుకున్న స్నేహ దక్షిణాదికొచ్చి తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా', 'కరెంట్', 'సింహా' వంటి సినిమాలతో ఫర్వాలేదనిపించుకుంది.
ఈ సమయంలో వెన్ను గాయానికి గురవడం ఆమెకి కష్టాలు తెచ్చిపెట్టింది. విశ్రాంతి తప్పనిసరి కావడంతో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న ఆమెకి తెలుగులో కానీ, తమిళంలో కానీ చెప్పుకోదగ్గ అవకాశాలు రావడం లేదు. దాంతో నిరాశకు గురైన ఆమె తిరిగి బాలీవుడ్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇటీవల ఓ సెక్సీ వీడియోను విడుదలచేసి, అందరి దృష్టినీ ఆకర్షించింది. అలాగే ఓ బాలీవుడ్ నిర్మాతని కూడా కలుసుకుంది. చూస్తుంటే త్వరలోనే స్నేహ బాలీవుడ్‌లో మళ్లీ కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger