సినిమా రంగంలో ఒక్కసారిగా సినిమాలు పరంపంరలు కొనసాగిస్తూ... అందరినీ ఆశ్చర్యపర్చిన బేనర్ ఆర్‌ఆర్‌మూవీమేకర్స్. దీని నిర్మాత వెంకట్. ఆయన ఎవరనేది చాలామందికి తెలీదు. తెర వెనుక నుంచి సినిమా తీస్తుంటారు. ముందు మాత్రం అచ్చిరెడ్డి. సురేష్ వంటి వారిని పెడుతుంటారు. వెంకట్‌కి మానవత్వంగల మనిషిగా పేరుంది. తన ప్రతి సినిమా ఆడియోనాడు పలు దానాలు చేస్తుంటారు. పేదలకు విరళాలు ఇస్తుంటారు. అటువంటి బేనర్ ఇప్పుడు కష్టాల్లో ఉందని ఫిలింనగర్ కథనం.
'ది ఎండ్' అనే పేరుతో తొలిసారిగా సినిమా తీసి మంచి సినిమా నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు వెంకట్. ఆ చిత్రంలో నాగబాబు ప్రధానపాత్ర... యాదృశ్చికమో ఏమోకానీ ఆర్‌ఆర్ మూవీమేకర్స్ సంస్థకు ఇక 'ది ఎండ్'అని పడుతుందనే వార్తలు కలకలం రేపాయి. వారిని నమ్ముకుని పనిచేస్తున్న చాలామంది కార్మికుల గుండెలు గుభేలుమంటున్నాయి.
డిస్ట్రిబ్యూషనే కారణమా?
ఎన్నో విజయవంతమైన సినిమాలు తీసిన సంస్థ ఆర్‌ఆర్ మూవీమేకర్స్.. వేణుమాధవ్, అలీతో 'హంగామా' తీసింది. శ్రీకాంత్‌తో ఓ సినిమా తీసింది. ఆ తర్వాత గుండమ్మగారి మనవడు తీసింది. కానీ రవితేజతో 'కిక్' సినిమాతో పెద్ద పేరు వచ్చింది. లేటెస్ట్‌గా 'బిజినెస్‌మేన్' చేసింది. రెండూ భారీ సినిమాలు. అయితే పెట్టిన పెట్టుబడికి మించిన ఆదాయం రాలేదన్నది ఫిలింనగర్ టాక్. కిక్ విజయం స్పూర్తితో ఆర్‌ఆర్ డిస్ట్రిబ్యూషన్ కూడా స్థాపించింది. దీంతో పలు చిత్రాలు డిస్ట్రిబ్యూషన్ తీసుకుని నష్టపోయింది.
తాజాగా 'లవ్‌లీ' సినిమా తీసింది. అందులో కొంత పెట్టుబడి పెట్టింది. సినిమా మంచి టాక్ వచ్చినా.. కలెక్షన్లు లేకపోవడంతో కొంత నష్టం ఏర్పడింది. దీనికంటే ముందుగా స్టార్ట్ చేసిన 'డమరుకం' చిత్రం ఇంకా పూర్తికాలేదు. నాగార్జునతో మొదలుపెట్టిన ఈ సినిమా ఏడాది గడిచింది. అయితే ఈ సినిమాలో భారీగా పెట్టుబడి పెట్టారని తెలిసింది.
మొదట అనుకున్న దానికంటే డబుల్ అయింది. చిత్ర దర్శకుడు శ్రీనివాసరెడ్డి కూడా చేతులెత్తేశారు. దీంతో ఆయన మాట కూడా నెగ్గడం లేదు. మరోవైపు... ఎస్‌వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో ఓ హాలీవుడ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ చిత్రమంటే మాటలు కాదు. కానీ అది శ్రీకాంత్ నటించిన 'వినోదం' బేస్డ్‌తో ఎంటర్‌టైన్‌మెంట్ తీస్తున్నట్లు సమాచారం.
మొత్తానికి ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎదిగిన ఆర్‌ఆర్ మూవీమేకర్స్ ప్రస్తుతం ఫైనాన్షర్లపై ఆధారపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఎంతోమందికి ఆధారం చూపిన ఆ సంస్థ నిలబడాలని శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు.

| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment