.
Home » » బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు "రచ్చ" చేస్తున్న చెర్రీ!!

బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు "రచ్చ" చేస్తున్న చెర్రీ!!

Written By Hot nd spicy on Tuesday, 10 April 2012 | 09:15

మెగాస్టార్ తనయుడిగా వెండితెర అరంగేట్రం చేసిన చెర్రీ అలియాస్ రామ్ చరణ్ తేజ్.. ఇప్పటికి వరకు చేసిన చిత్రాల సంఖ్య కేవలం నాలుగంటే నాలుగు. మొదటి చిత్రం "చిరుత" కాగా, రెండో చిత్రం "మగధీర". మూడో చిత్రం "ఆరెంజ్". నాలుగో చిత్రం "రచ్చ". ఈ చిత్రాల్లో ఒక్క ఆరెంజ్ మినహా మిగిలిన చిత్రాలన్నీ సక్సెస్‌ సాధించాయి. 'మగధీర' అయితే ఏకంగా 75 వసంతాల తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాసింది.

ఇపుడు తాజాగా వచ్చిన చిత్రం "రచ్చ". నిజంగానే ఈ చిత్రం విడుదలైన అన్ని చోట్లా రచ్చ రచ్చ చేస్తోంది. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు షేక్ చేస్తోంది. ఫలితంగా.. అనేక అనేక పెద్ద సంస్థలు చెర్రీతో కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేసేందుకు సై అంటున్నాయి. అలాగే, బాలీవు్డ్ అవకాశాలు కూడా మెరుగ్గానే ఉన్నాయి. ఈ బాలీవుడ్ ప్రాజెక్టుల వివరాలు చెర్రీ తన హిందీ చిత్రం "జంజీర్" తర్వాత ప్రకటించే అవకాశం ఉంది.

టాలీవుడ్‌లో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చెర్రీ.. కేవలం ఒక్క చిత్రం మాత్రమే తీసిన అనుభవం ఉన్న సంపత్ నది వంటి దర్శకత్వంలో నటించాలని తీసుకున్న సాహసోపేత నిర్ణయమే చెర్రీకి ప్లస్ పాయింట్‌గా మారింది. ఫలితంగా.. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అందుకే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి కలెక్షన్ల రికార్డులు కురిపిస్తోంది.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger