రెండు రోజుల క్రితం అంటే ఆదివారం గబ్బర్ సింగ్ ఆడియో రోజు పవన్ కళ్యాణ్ సింహాచలం దేవస్థానంలో వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అయితే ఆయన దేవస్దానం దర్శించుకున్న సమయంలో.. పాద రక్షలతో దేవస్దానం లోనికి వచ్చారు. దాంతో దేవస్దానం అపచారమైనట్లు భావిస్తున్నారు. అయితే ఆ సంఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని దేవస్థానం కార్యానిర్వహణాధికారి సిహెచ్.నరసింగరావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నానికి దేవస్థానంలో సంప్రోక్షణ గావించారు.
తన దృష్టికి వచ్చిన ఆ అంశంపై విచారణ జరిపిస్తానని దేవస్థానం కార్యానిర్వహణాధికారి చెప్పారు. ఇప్పుడీ వార్త హాట్ టాపిక్ గా మారింది. ఏ రకంగా విచారణ చేస్తారు...ఏమి చేస్తారనేది అందరూ చర్చిస్తున్నారు. ఆ సంఘటన జరిగన వివరాల్లోకి వెళితే.. పవన్ కళ్యాణ్, చిత్ర యూనిట్ బృందం ఆదివారం హెలికాప్టర్‌లో ప్రయాణించి రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంది. మొదట తిరుపతి చేరుకొని శ్రీవారి ఆశీస్సులు అందుకున్న పవర్‌స్టార్, తదితరులు అనంతరం సింహాచలం చేరుకున్నారు.
అయితే దేవస్థానం వద్ద హఠాత్తుగా తమ అభిమాన హీరో ప్రత్యక్షం కావటంతో ఆయన్ను చూసేందుకు పోటీ పడ్డారు. షేక్ హ్యాండ్స్ కోసం ఎగబడ్డారు. అభిమానులను నియంత్రించటంలో పోలీసులు కూడా విఫలమయ్యారు. ఈ హడావుడిలో పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత బండ్ల గణేష్ బాబు పాదరక్షలు విడవకుండానే దేవస్థానంలోకి అడుగుపెట్టారు. ఈ సంఘటనను చిత్రీకరించటానికి ఒకరిద్దరు ఫోటో జర్నలిస్టులు ప్రయత్నించారు. దీంతో సింహాచలం దేవస్థానం అపవిత్రమైంది.
ఇక గబ్బర్ సింగ్ విషయానికి వస్తే ఈ చిత్రం ఆడియో విజయవంతంగా ఆదివారం అబిమానుల సమక్షంలో జరిగింది. రామ్ చరణ్ తప్ప మెగా హీరోలంతా హాజరైన ఈ పంక్షన్ ఓ పండగ వాతావరణాన్ని ప్రతిఫలించింది. దేవి శ్రీ ప్రసాద్ ఈ పంక్షన్ లో ఆడి పాడి తన ఆనందం వ్యక్తం చేసారు. సుమ యాంకరింగ్ చేసిన ఈ పంక్షన్ కి సిని ప్రముఖులంతా విచ్చేసారు. పవన్ మాట్లాడింది కొద్దిగానే అయనా తన అభిమానులను ఆనందింపచేసారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment