రవితేజ త్వరలో 'ప్లే బోయ్'అవతరించనున్నాడని సమాచారం. రవితేజ తో గతంలో డాన్ శీను డైరక్ట్ చేసిన గోపీచంద్ మలినేని మరోసారి రవితేజ తో ఓ చిత్రం ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం సిట్టింగ్స్ జరుగుతున్న ఈ చిత్రాన్ని విక్రమ్ తో వీడింతే..బై బర్త్ నిర్మించిన నిర్మాతలు ప్రొడ్యూస్ చేయనున్నారని తెలుస్తోంది. ఈ చిత్రంలో రవితేజ ఓ వెరైటి క్యారక్టైరేజేషన్ తో ప్లే బోయ్ గా అలరిస్తాడని అందుకే టైటిల్ గా 'ప్లే బోయ్' పెట్టనున్నాడని తెలుస్తోంది. డాన్ శీను లాగే ఫన్ తో నడిచే రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్తున్నారు.
ఇక వెంకటేష్ తో బాడీగార్డ్ చిత్రం రీమేక్ చేసిన గోపీచంద్ మలినేని కి ఇది మూడో చిత్రం. బాడీగార్డు ..సంక్రాంతికి విడుదలై మిశ్రమ పలితాన్ని పొందింది. కామిడీగా బాగానే ఉందని టాక్ వచ్చినా బిజినెస్ మ్యాన్ ముందు నిలవలేకపోయింది. ఫ్యామిలీలను టార్గెట్ చేసిన ఈ చిత్రం వారిని రీచ్ కాలేకపోయింది. అయితే ఇండస్ట్రీలో మాత్రం గోపీచంద్ కి దర్శకుడుగా మంచి పేరు తెచ్చిపెట్టింది. పెద్ద హీరోలను డీల్ చెయ్యగలడనే అనే విషయాన్ని తెలియచెప్పింది. దాంతో మరోసారి రవితేజతో ఈ చిత్రం చేసి తనేంటో నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నారు గోపీచంద్.
ఇక ప్రస్తుతం రవితేజ కెరీర్ కూడా ఏమీ బాగోలేదు. వరసగా దొంగల ముఠా,నిప్పు,వీర చిత్రాలు భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. రవితేజలో ఫన్ యాంగిల్ ని ఎక్సపెక్ట్ చేసి వెళ్లిన వారికి ఆ చిత్రాలు నిరాశపరిచాయి. ఇప్పుడు రవితేజ దృష్టి మొత్తం దరువు చిత్రంపైనే ఉంది. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన దరువు చిత్రం ఈ సారి తన అభిమానులను నిరాశపరచనే ధీమాలో ఉన్నాడు రవితేజ. మరో ప్రక్క తనను వెలుగులోకి తెచ్చిన పూరి జగన్నాధ్ తో దేముడు చేసిన మనుష్యులు చిత్రం చేస్తున్నాడు. ఇలియానా కాంబినేషన్ లో రూపొందుతున్న ఆ చిత్రం కూడా ఫన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే... ప్రముఖ నటుడు కమల్ హాసన్ నటిస్తూ,దర్శకత్వం వహించనున్న అమర్ హై చిత్రం లో రవితేజ కీ రోల్ ని పోషించనున్నారని తెలుస్తోంది. తమిళ, తెలుగు, మళయాళ, హిందీ భాషల్లో విడుదల అయ్యే ఈ చిత్రం కోసం ప్రతీ భాషకీ చెందిన నటులను ఈ చిత్రంలో తీసుకుంటున్నారు. అందులో భాగంగా తెలుగు నుంచి రవితేజ,మళయాళం నుంచి మోహన్ లాల్,తమిళం నుంచి అజిత్ ఇప్పటికి ఎంపిక అయ్యారు. హిందీ నుంచి ఎవరనేది తెలియటం లేదు. పంచతంత్రం సినిమా తరహాలో అన్ని భాషలకీ చెందిన వారిని ప్రాతినిధ్యం వహించే హీరోలతో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో ఈ చిత్రం నడుస్తుంది. లంచగొండితనం,రాజకీయాలు నేపధ్యంలో ఈ చిత్రం స్క్రిప్టు ని తయారు చేస్తున్నారు. ప్రస్తుతం తను డైరక్ట్ చేస్తున్న విశ్వరూపం అనంతంరం ఈ చిత్రాన్ని కమల్ రూపొందిస్తారు. ఈ చిత్రాన్ని దశావతారం నిర్మించిన ఆస్కార్ రవిచంద్రన్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment