అత్యంత ధనిక కుటుంబం నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించిన నటి మీనాక్షి తపర్ దారుణ హత్యకు గురైంది. ఆమె సహనటులే ఈ దారుణానికి ఒడిగట్టారు. మధుర్ భండార్కర్ 'హీరోయిన్' చిత్రంలో కరీనా కపూర్‌తో పాటు కీలక పాత్రలో నటిస్తున్న మీనాక్షిని ఆమెతో నటించే సహనటులు నమ్మించి హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. అమిత్ జైస్వాల్ అతడి ప్రియురాలు ప్రీతి సురీన్లిద్దరూ ధనికురాలైన మీనాక్షిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలనుకున్నారు. అనుకున్నట్లే మీనాక్షిని నమ్మించి గోరఖ్‌పూర్ వెళదామని ఆమెను కిడ్నాప్ చేసి ఓ హోటల్ గదిలో బంధించారు. కిడ్నాప్ చేసిన అనంతరం మీనాక్షి తల్లిదండ్రులకు పోన్ చేసి రూ. 15 లక్షలు రూపాయలు డిమాండ్ చేశారు. ఐతే మీనాక్షి తల్లిదండ్రులు రూ. 60 వేలు మాత్రమే ఇవ్వడంతో మీనాక్షిని వదల్లేదు. చివరికి ఆమెను దారుణంగా హతమార్చి శరీరాన్ని ముక్కలుముక్కలుగా కోసి వాటర్ ట్యాంకులో పడవేశారు. అనంతరం మీనాక్షి తలను వాళ్లు బస చేసిన హోటల్ గది కిటికీలో నుంచి రోడ్డుపై వెళుతున్న ఓ బస్సుపై విసిరేశారు. ఈ దారుణ సంఘటనను తెలుసుకున్న బాలీవుడ్ ఇండస్ట్రీ షాక్‌కు గురైంది. కాగా నిందితులిద్దరూ నేరుగా వెళ్లి పోలీసు స్టేషన్లో లొంగిపోయారు.
Post a Comment