ప్రభుదేవా-నయన ప్రేమాయణం రసవత్తరంగా, మహా రంజుగా సాగి చివరకు ఎవరూ ఊహించని విధంగా ముక్కలైన సంగతి తెలిసిందే. నయనతార కుటుంబ సభ్యులు మీడియా ముందు వచ్చి ప్రభుదేవా పచ్చి మోసగాడు, డబ్బు కోసమే ఆమెను ముగ్గులోకి దించారంటూ ఆరోపణలు చేశారు.
ఇక నయనతార ఇటీవల ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ....నేను నిజాయితీగా ప్రేమించాను, ఎన్నో తాగ్యాలు చేశాను. కానీ నాకు, నా ప్రేమకు విలువ లేక పోవడం వల్లనే విడిపోయాను అంటూ ప్రభుదేవాను దోషిని చేసింది. అయితే అసలు ఏం జరిగిందో? అనే మ్యాటర్ మాత్రం చెప్పలేదు.
అయితే నయనతార, ఆమె కుటుంబం జనాల ముందు తనను ఒక దోషిగా, మోసగాడిగా నిలబెట్టినా....ప్రభుదేవా మాత్రం ఇంత వరకు నోరు విప్పలేదు. అప్పటి నుంచి ఆయన మీడియాకు కనిపించడమే మానేశారు. మరి ప్రభుదేవా ఎందుకు ఇలా చేస్తున్నారు? ఆయన మౌనం వెనక వ్యూహం ఏమిటి? అనేది మాత్రం ఎవరికీ అంతుపట్టడం లేదు.
ప్రభుదేవా మౌనాన్ని సినీ ప్రేమికులు రకరకాలు అర్థం చేసుకుంటున్నారు. ప్రభుదేవా తప్పు చేసాడు కాబట్టే నోటికి తాళం వేసుకున్నాడని కొందరు అంటుంటే...మరికొందరు ఆయన మౌనం వెనక ఏదో వ్యూహం ఉందని, సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వలన మీడియా ముందుకు రాలేక పోతున్నారని అంటున్నారు.
ఇటీవల తన బర్త్ డే పార్టీని చెన్నయ్‌లో గ్రాండ్‌గా జరుపుకున్న ప్రభుదేవా....ఆ పార్టీకి వచ్చిన పరిశ్రమ ప్రముఖులు, సన్నిహితుల వద్ద కూడా ఈ విషయం ప్రస్తావనే తేలేదట. దీన్ని బట్టి నయనతార విషయాన్ని ప్రభుదేవా లైట్ తీసుకుంటున్నాడని, కొంత కాలం తర్వాత జనాలతో పాటు, మీడియా వారు కూడా ఈ విషయాన్ని మర్చిపోతారనే భావనతో ప్రభుదేవా ఉన్నట్లు స్పష్ట మవుతోంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment