.
Home » , » బాలీవుడ్ బొమ్మాళిగా కరీనా కపూర్!!

బాలీవుడ్ బొమ్మాళిగా కరీనా కపూర్!!

Written By Hot nd spicy on Tuesday, 24 April 2012 | 10:00

టాలీవుడ్‌లో బొమ్మాళిగా అనుష్క తెలుగు ప్రేక్షకులను మెప్పించగా, ఇపుడు ఆ పాత్రను బాలీవుడ్ నటి కరీనా కపూర్ చేయనున్నారు. గతంలో అనుష్క ప్రధాన పాత్రధారిగా వచ్చిన చిత్రం 'అరుంధతి'. ఈ చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, అనుష్క సినీ కేరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

ప్రస్తుతం ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో నిర్మించనున్నారు. ఈ చిత్రం రీమేక్ హక్కులను ప్రముఖ బాలీవుడ్ నిర్మాత కైవసం చేసుకున్నారు. బాలీవుడ్‌లో నిర్మించే చిత్రంలో అనుష్క పాత్రకు కరీనా కపూర్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. తెలుగులో ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger