దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ‘డిపార్ట్ మెంట్’చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రంలో అమితాబ్ బచ్చన్, సంజయ్ దత్, రాణా దగ్గుబాటి, మంచు లక్ష్మి, మధు శాలిని ముఖ్య పాత్రలు పోషిస్తుండగా...బ్రెజిల్ మోడల్ నథాలియా కౌర్ ఐటం సాంగు చేస్తోంది.
అయితే ఈచిత్రానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ తమకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని మంచు లక్ష్మి ప్రసన్న తన సన్నిహితుల వద్ద చిటపటలాడుతోందట. డిపార్ట్మెంటు సినిమా అంటేనే నథాలియా కౌర్ అన్న చందంగా వర్మ ప్రచారం చేస్తున్నాడని, ఈ చిత్రంలో ఆమెకంటే ముఖ్య మైన పాత్రలు పోషిస్తున్న తమ గురించి కనీసం మాట్లాడటం లేదని, సినిమా ప్రారంభానికి ముందు బాలీవుడ్లో తమను పైకి తీసుకెలుతానని చెప్పిన వర్మ....తన సినిమాలోనే తమను సరిగా ప్రజెంట్ చేయడం లేదు, ఆయన మాటల మాయావి, మోసగాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.
రామ్ గోపాల్ వర్మ అవసరం కోసం వాడుకుని వదిలేసే రకమని సినిమా రంగంలో ఎప్పటి నుంచో వినిపిస్తున్న గుసగుసలు...ఇప్పడు అక్షరాల నిజం అవుతోందని ఈ సినిమాకు సంబంధించిన కో ప్రొడ్యూసర్ కిరణ్ కుమార్ కోనేరు కూడా మండి పడుతున్నాడట. డిపార్ట్ మెంటు చిత్రానికి కో ప్రొడ్యూసర్గా ఉండమని చెప్పి కిరణ్ కుమార్తో రూ. 3.5కోట్లు పెట్టుబడి పెట్టించిన వర్మ.....కనీసం తనతో మాటైనా చెప్పకుండా ఈ చిత్రాన్ని వయాకామ్18 అనే సంస్థకు అమ్మేశాడట.
గతంలో కిరణ్ కుమార్ కోనేరు రామ్ గోపాల్ వర్మను నమ్మి ‘అప్పల్రాజు’ చిత్రాన్ని నిర్మించి భారీగా నష్టపోయిన విషయం తెలిసిందే. డిపార్ట్ మెంట్ చిత్రంలో ఎంతో కొంత పెట్టుబడి పెట్టి కాస్త లాభ పడదామని భావించిన కిరణ్ కుమార్ కోనేరును వర్మ తనను వాడుకున్న వైనాన్ని చూసి ఎటూ పాలుపోని పరిస్థితిలో ఉన్నాడట.

Post a Comment