రామ్ చరణ్ తేజ తాజా చిత్రం 'రచ్చ'టాక్ కు అతీతంగా కలెక్షన్స్ మాత్రం అదరకొడుతోంది. కర్ణాటకలోనూ భారీగా విడుదలైన ఈ చిత్రం అక్కడ కోటి ఎనభై లక్షల వరకూ ఇప్పటివరకూ కలెక్టు చేసిందని ట్రేడ్ వర్గాల అంచనా. కర్ణాటకలో ఈ చిత్రం 36 ధియేటర్స్ లలో విడుదలైంది. అన్ని చోట్ల విడుదలైన నాటినుంచి ఓ పెద్ద కన్నడ సినిమాకు ఉన్నట్లే ఈ తెలుగు చిత్రానికి కలెక్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా రాయచూర్ వంటి బోర్డర్ ప్రాంతాలలో వీకెండ్ లలో ఆక్యుపెన్స్ రేటు వందకు వంద శాతం ఉండటం అందరకీ ఆశ్చర్యపరుస్తోంది.
శనివారం, ఆదివారం బెంగుళూరులో 'రచ్చ'చిత్రం మల్టిప్లెక్స్ లలో హౌస్ ఫుల్ బోర్డులు పెట్టారు. దూకుడు తర్వాత ఈ రేంజి కలెక్షన్స్ అందుకున్న చిత్రం ఇదేనని అక్కడి ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఓ సునామీలా జనం ఈ రెండు రోజులూ ధియోటర్స్ పై పడ్డారని అక్కడ మీడియా ఈ చిత్రం గురించి వ్యాఖ్యానించింది. ఇదే హవా మరో రెండు వీకెండ్ లు వరకూ గ్యారెంటీగా ఉంటుందని అక్కడ ధియోటర్స్ వారు అంచనా వేస్తున్నారు. కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకున్న వాళ్ళు తాము పూర్తి హ్యాపీ అంటున్నారు.
క్రితం గురువారం అంటే ఈ నెల 5న 'రచ్చ' విడుదలైంది. రాంచరణ్, తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఆర్.బి. చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలిమ్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై ఎన్.వి. ప్రసాద్, పారస్ జైన్ సంయుక్తంగా నిర్మించారు. 'రచ్చ' చిత్రం తొలి మూడు రోజుల్లో రూ. 15 కోట్ల షేర్ సాధించిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్.వి. ప్రసాద్ ప్రకటించారు. మూడు భాషల్లో కలిపి దక్షిణ భారతంలో 'రచ్చ' ఆల్ టైమ్ రికార్డ్‌గా నిలుస్తుందని ఆశిస్తున్నాం. ఈ విజయం మెగా అభిమానులదే అని ఆయన చెప్పారు.
తమిళంలో ఈ నెల 6న 'రగళై' పేరుతో 280 థియేటర్లలో విడుదల చేస్తే దాని కలెక్షన్లకు తమిళ చిత్ర పరిశ్రమ షాక్‌కు గురయింది. మలయాళంలో 'రచ్చ' పేరుతోటే 13న విడుదల చేయబోతున్నారు. దర్శకుడు సంపత్ నంది మాట్లాడుతూ "అద్భుతాలు సృష్టించే ముందు ఎవరూ గుర్తించరు. సృష్టించాక ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు. సినిమా ఈ స్థాయి హిట్ కావడానికి ఒకే ఒక్క కారణం రాంచరణ్. 'రచ్చ' అంటేనే రాంచరణ్. నేను కళాఖండం తీయలేదు. కమర్షియల్ సినిమా తీశా'' అని చెప్పారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment