ప్రభాస్, లారెన్స్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'రెబల్' బడ్జెట్ ఇబ్బడి ముబ్బడిగా ఫిల్మ్ నగర్ టాక్. ఏ రేంజి హిట్టయినా అంత రికవరి అవటం కష్టమే. మహేష్ బాబు,రామ్ చరణ్ లాంటి స్టార్స్ మీదే ఆ రేంజి డబ్బులు పెట్టుబడి పెట్టాలంటే ఆలోచించే స్ధితిలో లారెన్స్ అలా ఖర్చు పెట్టించటమేంటి అంటున్నారు. నిర్మాతలు ఎలా బయటపడతారో అని మాట్లాడుకుంటున్నారు. దాంతో సంక్రాంతికి విడుదుల అనుకున్న ఈ చిత్రం వేసవికి కూడా విడుదల అయ్యే పరిస్ధితి ఏమీ కనపడటం లేదు.
అందులోనూ కాంచన హిట్టవటంతో ఎవరి మాటా వినే స్దితిలో లేడు లారెన్స్. అయితే లారెన్స్ మాత్రం ఈ చిత్రం గురించి మీడియాలో ఊదరకొడుతున్నాడు. ఈ చిత్రంలో ప్రభాస్ క్యారక్టరైజేషన్ చాలా డిఫెరెంట్ గా ఉంటుందంటున్నారు దర్శకుడు లారెన్స్. ఆయన ఈ విషయమై మాట్లాడుతూ...మా సినిమా లో హీరో కూర్చుని కబుర్లు చెప్పే రకం కాదు. రంగంలోకి దిగి చేసి చూపిస్తాడు. ఏటికి ఎదురీదడం అతనికిష్టం. పోరాడైనా గెలవడం అతని నైజం. ఇంతకీ అతని లక్ష్యం ఏంటి? అనేది మా చిత్రంలో చూడాల్సిందే అన్నారు.
అలాగే ప్రభాస్ శైలికి సరిపోయే చిత్రమిది.‘రెబల్’ అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ‘రెబల్’ అనే టైటిల్ మత్రమే కాదు. కథ కూడా ప్రభాస్ కోసమే అన్నట్టుగా ఉంటుంది. ప్రభాస్ కెరీర్‌లో మాస్ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్న సినిమా ‘ఛత్రపతి’. ఆ సినిమాను మించే స్థాయిలో మా ‘రెబల్’ ఉంటుంది మాస్‌ని అలరించేలా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఎంటర్టైన్మెంట్ అందరికీ నచ్చుతుంది అన్నారు.
తమన్నా, దీక్షాసేథ్ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు. వేసవిలో 'రెబల్'ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. ప్రభాస్ కెరీర్‌లోనే ‘రెబల్’ హై బడ్జెట్ ఫిలిం అవుతుంది.షూటింగ్ క్లైమాక్స్ దశకు చేరిందని నిర్మాతలు చెప్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: సి.రాంప్రసాద్, మాటలు: ‘డార్లింగ్’స్వామి, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాణం: బాలాజీ సినీ మీడియా.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment