శంకర్,విక్రమ్ కాంబినేషన్ లో ఓ చిత్రం రెడీ కాబోతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గత కొద్ది రోజులుగా దర్శకుడు శంకర్ తన శైలి కథను సిద్ధం చేసుకొంటున్నారు. ఇక ఈ చిత్రంలో విక్రమ్ సరసన కథానాయికగా దీపికా పదుకొణెని ఎంచుకొన్నట్లు బాలీవుడ్ సమాచారం. ఆమెతో శంకర్ బృందం చర్చలు సాగిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ స్వరాలు సమకూరుస్తారు. దీపిక ప్రస్తుతం రజనీకాంత్‌తో కలిసి 'కోచ్చడయాన్'లో నటిస్తోంది.
ఇక తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా సినిమా వస్తుందంటూ గత కొద్ది రోజులుగా రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయన విక్రమ్ తోనే ఫిక్స్ అయినట్లు సమాచారం. పవన్ డేట్స్ అస్సలు ఖాళీ లేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై శంకర్‌ని అడిగితే ''ప్రస్తుతం ఓ కథను సిద్ధం చేసుకొంటున్నాను. అయితే హీరో ఎవరనేది ఇంకా నిర్ణయించుకోలేదు'' అని చెప్పారు. ఇక బాలీవుడ్ సినిమా 'త్రీ ఇడియట్స్' ని రీమేక్ చేసిన తరవాత శంకర్... మళ్లీ తన శైలిలోకి వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు.
కొన్ని రోజులుగా ఈ విషయంపై శంకర్, విక్రమ్‌ల మధ్య చర్చలు నడుస్తున్నాయని తెలిసింది. విక్రమ్ కెరీర్‌లో గుర్తుండిపోయే చిత్రం 'అపరిచితుడు'. శంకర్ ఆలోచనలకు, సృజనాత్మకతకూ ఈ సినిమా అద్దం పట్టింది. మళ్లీ వీరిద్దరి కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది.. ఆ అవకాశం ఉందంటున్నారు శంకర్ అభిమానులు. విక్రమ్‌ని దృష్టిలో పెట్టుకొని శంకర్ ఓ కథను సిద్ధం చేసుకొన్నారని సమాచారం.
ఇక 'కోచ్చడయాన్'విషయానికి వస్తే రజనీ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతోంది. ఈ చిత్రానికి సైతం ఎఆర్ రహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్రీడి లో టైటినిక్ తరహా గ్రాఫిక్స్ తో పూర్తి హంగులతో భారీ ఖర్చుతో ఈ చిత్రం రూపొందుతోంది. కాస్త టైమ్ ఎక్కువ తీసుకున్నా ఈ చిత్రం రజనీ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment