.
Home » , » ఎన్టీఆర్ 'దమ్ము' కథేంటి?

ఎన్టీఆర్ 'దమ్ము' కథేంటి?

Written By Hot nd spicy on Friday, 27 April 2012 | 09:35

ఈ రోజు విడుదల అవుతన్న జూ.ఎన్టీఆర్ చిత్రం దమ్ము. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విజయధ్వజ శ్రీసింహ అనే పక్కా మాస్ పాత్రను పోషిస్తున్నాడు. విజయ్ అనే పిలవబడే విజయధ్వజ శ్రీసింహ (ఎన్టీఆర్‌) పట్టణంలో పెరిగిన కుర్రాడు. అందరూ బాగుండాలి.. ఆ అందరిలో నేనుండాలి అనుకునే మనస్తత్వం ఉన్నవాడు. అతను సత్య (త్రిష)ని ప్రేమిస్తుంటాడు. ఇతనికి ఊళ్లో నీలవేణి (కార్తీక) అనే మరదలు ఉంటుంది. ఎలాంటి చిక్కునైనా నేర్పుగా పరిష్కరించే అతనికో సమస్య ఎదురవుతుంది. అందుకోసం పట్నం నుంచి ఊరికి బయలుదేరతాడు. తరవాత ఏమైందనేది అసలు కథ.

రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''విందుభోజనం లాంటి సినిమా ఇది. యాక్షన్‌, వినోదం సమపాళ్లలో మేళవించాం. కుటుంబ బంధాలకు ప్రాధాన్యం ఉంటుంది. ఎన్టీఆర్‌ పలికే సంభాషణలు ఆకట్టుకుంటాయి. కీరవాణి స్వరాలు.. మరీ ముఖ్యంగా 'రూలర్‌' అనే గీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి''అన్నారు. అలాగే ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ మసాలా చిత్రం అని చెప్తున్నారు. సినిమాలో ఎక్కడా డల్ మూవ్ మెంట్ అనేది ఉండదని, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చోబెట్టే సన్నివేశాలు సెకండాఫ్ లో చాలా ఉన్నాయని అంటున్నారు.

ఫస్టాఫ్ మొత్తం పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కి కేటాయించాడని, కేవలం ఇంటర్వెల్ వద్ద వచ్చే యాక్షన్ సన్నివేశం తప్ప మొత్తం సరదాగా గడిచిపోతుందని టాక్. అలాగే సెకండాఫ్ పూర్తిగా హై ఓల్టేజ్ తో కూడిన డ్రామా ని నింపారని, అదే ప్రేక్షకుడుని పట్టుకుని, సినిమాని లాంగ్ రన్ నిలిపే అంశమని, ముఖ్యంగా సెంటిమెంట్, ఎమోషన్ తో కూడిన సన్నివేశాలు సినిమాకు బాగా ప్లస్ అయ్యేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుని ఎడిట్ చేయించారని చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ డాన్స్ లు, హిలేరియస్ కామెడీ సినిమాకు ప్రాణమై నిలుస్తాయని చెప్తున్నారు.

ఈ చిత్రంపై కార్తీక సైతం భారీగా ఆశలు పెట్టుకుంది. ఆమె మాట్లాడుతూ... దమ్ములో నా పాత్ర పేరు నీలవేణి. ఘనమైన వంశ చరిత్ర కలిగిన ఓ పెద్ద కుటుంబానికి చెందిన యువతిని. ఇక అలాంటి కుటుంబంలో ఉన్న యువతి పాత్ర ఎంత హుందాగా, హంగామాగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నటన విషయానికొస్తే... నవరసాలూ పలికించే అవకాశం దక్కింది.

కథానాయికగా తొలి అడుగులు వేస్తున్న సమయంలోనే ఇలాంటి పాత్ర దక్కడం సంతోషంగా అనిపించింది అంది. అలాగే ఎన్టీఆర్ తో సినిమా అనగానే నాకు ముందుగా గుర్తొచ్చింది కూడా డ్యాన్సే. క్లిష్టమైన భంగిమల్ని కూడా అలవోకగా చేసేస్తారు. నిజంగా తెలుగు ప్రేక్షకులు కూడా ఆయన్నించి ఎప్పటికప్పుడు కొత్త స్టెప్పులు ఆశిస్తుంటారు. 'దమ్ము'లో ఆయన చాలా బాగా చేశారు. ముఖ్యంగా టైటిల్‌ సాంగ్ అయితే హైలైట్‌గా నిలుస్తుంది. సెట్‌లో ఆయన నృత్యం చూసి విస్తుపోయాను. ఎన్టీఆర్‌ ఏం చేసినా మనసుపెట్టి చేస్తారు... అది నటన అయినా, నృత్యమైనా, ఫైట్ అయినా అంటూ చెప్పుకొచ్చింది.

బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఎన్టీఆర్, త్రిష, కార్తీక కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'దమ్ము'. ఈ చిత్రంలో ఎన్టీఆర్ క్యారెక్టర్ డిఫెరెంట్ గా సాగుతుంది. దాని గురించి దర్శకుడు బోయపాటి శ్రీను వివరిస్తూ... అందరూ బాగుండాలి. అందరిలో నేనుండాలి...ఇదీ ఓ యువకుడి సిద్ధాంతం. అందుకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా అతను ఊరుకోడు. తన దారికి అడ్డొచ్చిన వారికి దమ్ము చూపేదాకా వదలడు. ఆ కథేమిటో తెలియాలంటే మా చిత్రం చూడాల్సిందే అంటున్నారు.

అలాగే... ఎన్టీఆర్‌ నటనను ఇప్పటిదాకా ఒకవైపే చూశారు. రెండోవైపు చూపించే చిత్రమిది. నడక, స్త్టెల్‌... అన్ని విషయాల్లోనూ వైవిధ్యం ప్రదర్శించారు. ప్రతి ప్రేక్షకుడు సంతృప్తిపడేలా, ప్రతి అభిమానీ గర్వపడేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కీరవాణి స్వరపరిచిన పాటలకి చక్కటి స్పందన లభిస్తోంది. నిర్మాత వల్లభ సహకారం మరిచిపోలేనిదని అన్నారు. భానుప్రియ, నాజర్‌, సుమన్‌, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, శుభలేఖ సుధాకర్‌, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. రచన: ఎమ్‌.రత్నం, పాటలు: చంద్రబోస్‌, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌. ఈ చిత్రానికి కె.ఎ.వల్లభ నిర్మాత. కె.ఎస్‌.రామారావు సమర్పకులు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger