రవితేజ త్వరలో బుల్లెట్ రాజా గా కనిపించి అదరకొట్టనున్నాడు. అయితే ఇది రవితేజ కొత్త చిత్రం టైటిల్ మాత్రం కాదు. రవితేజ నటించి,రెడీగా రిలీజ్ కు ఉన్న దరువు చిత్రంలో రవితేజ పాత్ర పేరు ఇది. ఈ పాత్ర చాలా ఉషారుగా ఉంటుందని చెప్తున్నారు. విక్రమార్కుడులో అత్తిలి సత్తిబాబు పాత్రలా వినోదాన్ని పంచుతుందని హామీ ఇస్తున్నారు.ఈ పాత్ర మొదటి నుంచి చివరి దాకా హిలేరియస్ కామిడీతో సాగుతుందని చెప్తున్నారు. బుల్లెట్ లా స్పీడుగా దూసుకుపోతాడు, శతృవులకు బుల్లెట్ లా కనిపిస్తాడు కాబట్టి ఈ పాత్రకు బుల్లెట్ రాజా అని పేరు పెట్టాడంటున్నారు. ఇక ఈ పాత్రకు జోడీగా తాప్సీ చేస్తోంది. యమలోకం బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం నడుస్తుంది.
రవితేజ హీరోగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శివ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మిస్తున్న భారీ చిత్రం ‘దరువు’(సౌండ్ ఆఫ్ మాస్). రవితేజ సరసన తాప్సీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో రీసెంట్ గా విడుదలైంది. ఈ ఆడియో విన్నవారు రవితేజ మార్కు సినిమాకు ఏమాత్రం తీసిపోకుండా సినిమా అంటున్నారు. ‘నిప్పు’ సినిమా ప్లాపవడంతో అభిమానులు ‘దరువు’ చిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెలలో ఈచిత్రం షూటింగ్ పూర్తి కానుంది. నిర్మాణానంతర కార్యక్రమాల అనంతరం మే 18న చిత్రం విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
చిత్రం గురించి రవితేజ మాట్లాడుతూ..''నా సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయి. యాక్షన్, వినోదం, గెటప్పులు... ఇలా అన్ని విషయాల్లోనూ దరువు వినిపించేలా ఉంటుంది ఈ చిత్రం . శివతో నాకిది మొదటి సినిమా. ఫెంటాస్టిక్ డెరైక్టర్. సినిమా బాగా వచ్చింది. శివరామకృష్ణగారు రాజీపడని నిర్మాత. మాటలు, ఫైట్లు, డాన్సులు.. ఇలా అన్ని రకాలుగా ప్రేక్షకులతో ఈ చిత్రం దరువేయిస్తుంది. ఇది మంచి చిత్రం అవుతుందని 100 శాతం నమ్ముతున్నాను. ఈ సినిమాకి సంబంధించిన సన్నివేశాలను శివ చెబుతున్నప్పుడు నాకు నేనే చాలాసార్లు దరువేసుకున్నాను అన్నారు.
మాస్ మహారాజా రవితేజ, తాప్సీ, బ్రహ్మానందం, షాయాజీ షిండే, రఘుబాబు, అవినాష్, సుశాంత్, సన, ఎం.ఎస్. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, వెన్నెల కిషోర్, ప్రత్యేక పాత్రలో ప్రభు నటిస్తున్న ఈ చిత్రానికి కథ-స్ర్కీన్ ప్లే: శివ, ఆదినారాయణ, మాటలు: రమేష్ గోపి, అనిల్ రావిపూడి, సంగీతం: విజయ్ ఆంథోని, ఎడిటింగ్: గౌతం రాజు, పాటలు: భాస్కరభట్ల, రామజోగయ్య శాస్త్రి, సుద్దాల అశోక్ తేజ, ఫోటో గ్రఫీ: వెట్రివేల్, ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్, కో -డైరెక్టర్స్: సత్యం బాబు, ఆది నారాయణ, అసోసియేట్స్: హరి, రాధా కృష్ణ, సాయి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చిట్టూరి శ్రీనివాసరావు, సమర్పణ: శ్రీమతి నాగమునీశ్వరి, నిర్మాత: బూరుగుపల్లి శివరామకృష్ణ, కథ-స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శివ.

Post a Comment