Pages

Thursday, 26 April 2012

నరుక్కోవడం ఇష్టపడేవారికి నచ్చుతుందట ఎన్టీఆర్ "దమ్ము"

మరో "సింహాద్రి" అని విడుదలకు ముందు నుంచే అనుకుంటున్న "దమ్ము" చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లో భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ఈ నెల 27వ తేదీన.. అంటే రేపు విడుదలకు సిద్ధమవుతోంది. దమ్ములో సిస్టర్ సెంటిమెంట్‌ను ఆధారంగా చేసుకుని సింహా డైరెక్టర్ బోయపాటి శ్రీను కథను ముందుకు నడిపించినట్లు చెపుతున్నారు.

ముఖ్యంగా ఈ చిత్రంలో హింస పాళ్లు ఎక్కువేనట. కత్తులు, బాకులు, గొడ్డళ్లతో నరకే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇటువంటి సీన్లలో ఎన్టీఆర్ నటన గురించి వేరే చెప్పక్కర్లేదు. సింహాద్రిలో ఆల్రెడీ బాగా నరికేశాడు. ఇక దమ్ములో అంతకుమించి నరికేస్తాడంటున్నారు.

ఈ సినిమాకు ఏదైనా వీక్‌ పాయింట్ ఉందా... అని అంటే అది కేవలం నటీమణులేనట. ఇద్దరూ జూనియర్ ఎన్టీఆర్‌తో కొత్తగా జోడీ కట్టినవారే. త్రిష, కార్తీక ఇద్దరి అందాలను చూళ్లేక ప్రేక్షకులు పడిపోవాల్సిందేనంటున్నారు. ఎందుకు పడిపోతారు అని అడిగితే.. చూసిన తర్వాత ప్రేక్షకులకు తెలుస్తుందని అంటున్నారు.

మొత్తమ్మీద బోయపాటి శ్రీను మరోసారి తన చిత్రంలో కత్తులు, గొడ్డళ్లకు పదునుపెట్టడమే కాదు.. ఎక్కడ చూసినా సింహాల విగ్రహాలను కూడా తెరపైకి తెచ్చాడు. ఈ చిత్రం ఏ రేంజ్‌లో ఆడుతుందో చూడాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే...!!

No comments:

Post a Comment