పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ‘గబ్బర్ సింగ్’ఆడియో వేడుకకు చిరంజీవి ఈ సారి తప్పకుండా హాజరవుతారని, ఆయన తో పాటు నాగబాబు, మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ కూడా వస్తున్నారని ఆ చిత్ర యూనిట్ సభ్యుల నుంచి తాజాగా వినిపిస్తున్న సమాచారం.
ఈ నెల 15న గబ్బర్ సింగ్ ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. బండ్ల గణేష్ శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.
గతంలో పవర్ స్టార్ హీరోగా వచ్చిన ‘పంజా’ ఆడియో వేడుకకు చిరంజీవితో పాటు ఇతర మెగా హీరోలు ఎవరూ హాజరు కాలేదు. దీంతో పవన్ కళ్యాణ్ కి, మెగా స్టార్ కుటుంబానికి పడటం లేదని, ఇరువురి మధ్య విబేధాలు వచ్చాయంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. చిరంజీవి రాజకీయాల్లో అనుసరిస్తున్న పోకడలు పవన్ కళ్యాణ్‌కి నచ్చక పోవడమే ఇందుకు కారణం అనే ఓ వాదన కూడా వినిపించింది. అయితే ఆ తర్వాత చిరంజీవితో పాటు, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ వార్తలను ఖండించారు. వేరే పనులతో బిజీగా ఉండటం వల్లనే రాకలేక పోయామని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో మరోసారి అలాంటి వార్తలు రాసే అవకాశం మీడియా వారికి ఇవ్వకుండా....‘గబ్బర్ సింగ్’ ఆడియోకు తప్పనిసరిగా హాజరు కావాలని చిరంజీవితో పాటు మెగా కుటుంబం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తామంతా కలిసే ఉన్నామని, తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని ఆడియో వేడుక సాక్షిగా స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment