తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో వచ్చిన ‘3’ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు తాను ఎలాంటి నష్ట పరిహారం చెల్లించడం లేదని, తాను పరిహారం చెల్లించాలని నిర్ణయించుకున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సూపర్ స్టార్ రజనీకాంత్ తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయన లిఖిత పూర్వకంగా మీడియాకు లేఖ పంపారు.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో అల్లుడు ధనుష్ హీరోగా వచ్చిన ‘3’ సినిమా బాక్సాఫీసు వద్ద చతికిల పడ్డ విషయం తెలిసిందే. కొలవెరి ఫీవర్‌తో ఈ చిత్రానికి భారీగా కలెక్షన్లు వస్తాయని ఆశించిన డిస్ట్రిబ్యూటర్లంతా భంగపడి భారీగా నష్ట పోయారు. అయితే రెండు రోజులుగా మీడియాలో రజనీ నష్టపరిహారం చెల్లిస్తారనే వార్త హల్ చల్ చేస్తోంది.
తన సినిమాల వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునే ఉదార గుణం ఉన్న రజనీ...తన కూతురు ఐశ్వర్య సినిమా వల్ల నష్టపోయిన వారికి కూడా డబ్బు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారని ఆవార్తల సారంశం. తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నట్టి కుమార్ కూడా ఓ ఇంగ్లీష్ పత్రికతో మాట్లాడుతూ ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. దీంతో అంతా నిజమే అని నమ్మారు.
విషయం పెద్దది కాకముందు మేలుకుంటే మంచిదని గ్రహించిన రజనీ...ఆ సినిమాతో తనకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందుకు వివరణ ఇచ్చారు. పక్క ఫోటోలో చూస్తున్నది రజనీకాంత్ స్వయంగా రాసిన లేఖ.

Share with Friends : |
Share with Friends : |
Post a Comment