విజయ్, ఇలియానా జంటగా రూపొందించిన 'నంబన్' (తెలుగులో 'స్నేహితుడు') సినిమా తర్వాత టాప్ డైరెక్టర్ శంకర్ ఏం చేస్తున్నాడు? అందరి మనసుల్లో మెదులుతున్న ప్రశ్న ఇది. అటు తమిళ 'నంబన్' కానీ, ఇటు తెలుగు 'స్నేహితుడు' కానీ ఆశించిన రీతిలో ఆడలేదు. అదివరకు 'శివాజీ', 'రోబో' సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి సంచలన విజయం సాధించడంతో దర్శకుడిగా శంకర్ ఖ్యాతి ఖండాంతరాలు దాటింది. అలాంటి దర్శకుడు 'నంబన్' విషయంలో తేలిపోయాడు. అయితే అతడు ఆ విషయాన్ని పట్టించుకోకుండా తదుపరి సినిమా స్క్రిప్టులో పూర్తిగా నిమగ్నమయ్యాడు.
ప్రసుతం నేను కొత్త స్క్రిప్ట్ పనిలో ఉన్నా. ఏ హీరోతో ఈ స్క్రిప్ట్ చేయాలనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇప్పుడు నా దృష్టంగా కథమీదే" అని ఆయన ట్వీట్ చేశాడు. కాలీవుడ్‌లో మాత్రం శంకర్ తదుపరి సినిమాలో విక్రం హీరోగా నటించబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది.ఆ ఇద్దరి కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన 'అన్నియన్' (అపరిచితుడు) సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఆ కాంబినేషన్ మళ్లీ కలిస్తే అది 'అపరిచితుడు'ను మించి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది విశ్లేషకుల అభిప్రాయం. మరి శంకర్ ఎవరి ఎంచుకుంటాడో చూడాలి.
| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment