పవన్ కల్యాణ్, ఇలియానా కాంబినేషన్ లో వచ్చిన 'జల్సా'చిత్రం ఘన విజయం సాధించింది. దాంతో ఈ చిత్రం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ సినిమాకీ త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తారని తెలిసింది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. త్రివిక్రమ్, పవన్‌కల్యాణ్‌లు వారి వారి సినిమాలతో బిజీగా ఉన్నారు. అక్టోబరులో ఈ కొత్త సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఇక ఇలియానా ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన త్రివిక్రమ్ కాంబినేషన్ లో రెడీ అవుతున్న చిత్రం లో చేస్తోంది. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సైతం స్పీడుగా విడుదలకు సిద్దమవుతోంది. ఇక నిర్మాత బివియస్ ఎన్ ప్రసాద్..రిలియన్స్ గ్రూప్ ఫైనాన్స్ తో వరస ప్రాజెక్టులతో ముందుకు వెళ్తున్నారు. కాంబినేషన్ రిపీట్ అయితే లాభ నష్టాలు మాట ఎలా ఉన్నా టేబుల్ ప్రాఫెట్స్ కు లోటు ఉండదని భావిస్తున్నారు.

Post a Comment