Pages

Tuesday, 13 March 2012

ముగ్గురితో లిప్ లాకా..? బాబోయ్ అంటున్న సమంత

గౌతం మీనన్ దర్శకత్వంలో ఆ మధ్య నాగచైతన్య-సమంత జంటగా వచ్చిన ‘ఏ మాయ చేసావె’ చిత్రంలో దర్శకుడు సమంతతో లిప్ లాక్ సీన్ చేయించిన విషయం తెలిసిందే. ఇదే సినిమాను వేర్వేరు భాషల్లో రీమేక్ చేసిన గౌతం మీనన్ ఆయా బాషల్లో హీరోయిన్లుగా నటించిన త్రిష(తమిళం), అమీ జాక్సన్(హిందీ)లతో కూడా లిప్ లాక్ సీన్లు చేయించాడు.

తాజాగా గౌతం మీనన్ రూపొందిస్తున్న సినిమా ‘ఎటో వెళ్లి పోయింది మనసు’. చిత్రానికి తెలుగు వెర్షన్‌లో హీరోగా నాని, తమిళ వెర్షన్లో జీవా, హిందీ వెర్షన్లో ఆదిత్యా రాయ్ కపూర్ హీరోలుగా ఎంపికవగా.... ఈ ముగ్గురు హీరోల సరసన సమంత ఒక్కదానినే హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో కూడా ముద్దు సీన్ ఉందని, సమంత ముగ్గురు హీరోలతో ముద్దు సీన్లలో పాల్గొంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే సమంత మాత్రం అలాంటి దేమీ లేదంటోంది. బాబోయ్ ముగ్గురితోనా? అనే విధంగా బిక్క ముకం వేసి ఈ చిత్రంలో ముద్దు సీన్లు లేవని, ఏమాయ చేసేవే సినిమాలో కథ డిమాండ్ చేసింది కాబట్టే లిప్ లాక్ సీన్లు చేయాల్సి వచ్చిందని స్పష్టం చేసింది. సమంత ప్రస్తుతం తెలుగులో ఈగ, ఆటోనగర్ సూర్య, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు లాంటి చిత్రాలతో పాటు పలు తమిళ ప్రాక్టులతో మహా బిజీగా గడుపుతోంది.

No comments:

Post a Comment