శేఖర్ కమ్ముల డిస్కవరీ కమలినీ ముఖర్జీ ఏమైపోయింది? తొలి సినిమా 'ఆనంద్'తోటే చక్కని అభినయాన్ని ప్రదర్శించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్ని గెల్చుకున్న ఆమె 'గోదావరి', 'గమ్యం', 'గోపి గోపిక గోదావరి' సినిమాలతో మరింత దగ్గరైంది. అంతే! ఆ తర్వాత ఆమె నుంచి మరో హిట్ రాలేదు. పోలీస్ పోలీస్, మా అన్నయ్య బంగారం, నాగవల్లి, విరోధి సినిమాలు ఆమె కెరీర్‌కు ఎలాంటి ప్రయోజనాన్నీ కలిగించలేకపోయాయి.
'గోపి గోపిక గోదావరి'లో కలిసి నటించిన వేణుకు జతగా చేసిన 'రామాచారి' సినిమా విడుదలైతే ఏవైనా కొత్త అవకాశాలు వస్తాయనుకుంటే, అదెప్పుడు విడుదలవుతుందో తెలీని స్థితి. టాప్ హీరోలెవరూ ఆమెని తమ సరసన కోరుకోకపోవడం కూడా ఆమె కెరీర్ ఆశించిన రీతిలో ఎదగక పోవడానికి ఓ కారణమని చెప్పాలి. ఆమెకు నటిగా పేరొచ్చిందే గానీ, గ్లామర్ హీరోయిన్ ముద్ర రాలేదు. సినిమాల్లో కంటే బయటే ఆమె కెమెరాల ముందు ఎక్స్‌పోజింగ్ చేసింది. అయినా ఉపయోగం లేకపోయింది. దీంతో తెలుగులో లాభం లేదనుకొని మాతృభాషలో 'అపరాజిత తుమి' అనే సినిమా చేసింది. ప్రస్తుతం ఆమె ఏం చేస్తున్నదో, ఏమో.
| Share with Friends : |
| Share with Friends : |

Post a Comment