‘బొమ్మరిల్లు’ లాంటి సూపర్ హిట్ ప్యామిలీ అండ్ లవ్ ఎంటర్ టైనర్‌తో ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు భాస్కర్. ఆ తర్వాత భాస్కర్ దర్శకత్వం వహించిన పరుగు సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వక పోయనా ఫర్వాలేదు అనిపించుకున్నాడు. అయితే అనంతరం రామ్ చరణ్ తేజ్‌తో తీసిన ‘ఆరెంజ్’ సినిమా ఈ దర్శకుడిని కోలుకోలేని దెబ్బతీసింది. ఈచిత్రం తెలుగు సినిమా చరిత్రలోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది.
ఈ నేపథ్యంలో చాలా కసిగా ఉన్న భాస్కర్ ఈ సారి పెద్ద ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు- భాస్కర్ కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోందని, భాస్కర్ చెప్పిన కథకు మహేష్ బాబు ఇంప్రెస్ అయిన అంగీకారం తెలిపాడని తెలుస్తోంది. యూటీవీ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈచిత్రం ఈ సంవత్సరం నవవంబర్లో ప్రారంభం అవుతుందని చర్చించుకుంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు. మల్టీ స్టారర్‌గా రూపొందుతున్న ఈచిత్రంలో విక్టరీ వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నాడు. వెంకీ సరసన జర్నీ ఫేం అంజలి, మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్లు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Post a Comment