.
Home » » రామ్ చరణ్ సినిమా పేరు... రచ్చ కాదు ‘రక్ష’

రామ్ చరణ్ సినిమా పేరు... రచ్చ కాదు ‘రక్ష’

Written By Hot nd spicy on Thursday, 22 March 2012 | 11:53

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళంలో విడుదల చేస్తున్నారు. అయితే మలయాళంలో ఈ చిత్రం పేరు రచ్చ కాదు. అక్కడ ఈ చిత్రాన్ని ‘రక్ష’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కేరళలో అల్లు అర్జున్‌కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అక్కడ జెండా పాతడానికి ట్రై చేస్తున్నాడు.

ఈచిత్రంలో చిరంజీవి సూపర్ హిట్ సాంగ్ ‘వాన వాన వెల్లువాయే’ పాటను రీమిక్స్ చేశారు. అచ్చ చిరంజీవిలా చరణ్ స్టెప్పులు వేస్తుండటంతో ఈ పాటకు మంచి స్సందన వస్తోంది. గతంలో మగధీర చిత్రంలో కూడా చిరంజీవి సూపర్ హిట్ పాట ‘బంగారు కోడి పెట్ట’ పాటను రీమిక్స్ చేయగా మంచి స్పందన వచ్చింది. తాజాగా వాన వాన వెల్లువాయే పాట కూడా రచ్చ సినిమాకు మంచి అసెట్ గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

నిర్మాతలు ఎన్వీ ప్రసాద్‌, పారాస్‌జైన్‌ మాట్లాడుతూ... మణిశర్మ అందించిన బాణీలన్నీ బాగున్నాయి. ఆడియోకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా 'గ్యాంగ్‌ లీడర్‌'లో 'వానా వానా వెల్లువాయె' పాట రీమిక్స్‌ చేసిన విధానం ఆకట్టుకొంటుంది. త్వరలోనే సినిమా విడుదల ప్రకటిస్తామని అన్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. చరణ్ తండ్రిగా తమిళ నటుడు పార్తిబన్ ఫ్లాష్ బ్యాక్‌లో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger