డర్జీ పిక్చర్ సినిమా చేయక ముందు బాలీవుడ్ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ గా ఉన్న విద్యా బాలన్....ఆ చిత్రం తర్వాత ఎనలేని పేరు ప్రఖ్యాతలు, ప్రశంసలు దక్కించు కోవడంతో పాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దెబ్బతో విద్యా బాలన్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్టులో చేరి పోయింది. ఆమెకు కుప్పలు తెప్పలుగా అవకాశాలు కూడా వచ్చి పడుతున్నాయి. ఇప్పుడామె జీవిత చరిత్రను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు బాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అయితే విద్యా మాత్రం ఈ విషయంలో ఏమీ ఎరుగనట్లు, అలాంటిదేమీ లేనట్లు సమాధానం ఇస్తోంది. అయితే సీనీ వర్గాల్లో మాత్రం...కావాలనే ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని చర్చించుకుంటున్నారు. సాధారణ హీరోయిన్ గా ఉన్న విద్యా ఈ స్థాయికి ఎలా చేరుకుంది. డర్జీ సబ్జెక్టును ఎంచుకుని సాహసోపేతంగా సినిమాలో అందాలు ఆరబొస్తూ, నసీరుద్దీన్ షా లాంటి ముసలి నటులతో నటించడానికి ఎలా అంగీకరించింది? ఈ సినిమా చేయడానికి ఆమెను ప్రభావితం చేసిన అంశాలు ఏమిటి? అనే సబ్జెక్టుతో ఈ సినిమా తెరకెక్కుతోందట. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో త్వరలోనే తేలనుంది.
Home »
» ఈ సారి విద్యా బాలన్ జీవితమే కథాంశం

Post a Comment