.
Home » » 3 ఆడియోలో అందరి "బుర్ర"లను తినేసిన యాంకర్ ఉదయభాను

3 ఆడియోలో అందరి "బుర్ర"లను తినేసిన యాంకర్ ఉదయభాను

Written By Hot nd spicy on Wednesday, 21 March 2012 | 09:48

రజనీకాంత్‌ అల్లుడు ధనుష్‌ ఏ సభకు వెళ్ళినా ఆయన మాట్లాడాలని అందరూ ఎదురుచూస్తుంటారు. అలాంటిది తను తాజాగా నటించిన '3' సినిమా తమిళ చిత్రం తెలుగు వర్షన్‌ ఆడియోను హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి తాజ్‌డక్కన్‌లో నిర్వహించారు చిత్ర నిర్మాత నట్టికుమార్‌.

ఈ ఆడియో వేడుకలో యాంకర్‌ ఉదయభాను శృతిమించిన యాంకరింగ్‌కు వచ్చిన వారంతా బెంబేలెత్తిపోయారు. మీడియా సరేసరే. ఎప్పుడు వదుల్తుంది నస అన్నట్లు వ్యవహరించారు. ఇలాంటి ఫంక్షన్లను ఏదో ఛానల్‌ రైట్స్‌ తీసుకోవడంతో మూడు గంటలపాటు ఏకబికిన ఏదో నస పెట్టే కార్యక్రమాలు, యాంకరింగ్‌లు చేయడం నిర్వాహకులకు పరిపాటే. కానీ.. '3' ఆడియో వేడుకలో ఉదయభను వ్యవహారం శృతి మించింది.

రామానాయుడుగారిని వేదికపైకి పిలిచి... 'కొలవెరి' పాటకు స్టెప్‌లు వేయాలని కోరింది. ఆయన తన భుజాలను ఎగురవేస్తూ ఆమె చెప్పినదానికి న్యాయం చేశారు. ఇక ఆ తర్వాత ఒక్కో అతిథులను పిలుస్తూ... ఉపమానాలతో, విసిగెత్తించింది. అతిథుల్ని మాట్లాడటానికి ఛాన్స్‌ ఇవ్వలేదు. ధనుష్‌ను పిలిచే టైంలో అలాగే జరిగింది. దీంతో ధనుష్‌ విసిగిపోయి.. 'ప్లీజ్‌.. నాకూ రెండు నిముషాలు మాట్లాడే టైమ్‌ ఇవ్వండని' ఆమెను వేడుకున్నాడు.

ఆ తర్వాత వర్ధమాన నటుడు రానా కూడా ఇదేవిధంగా 'నన్నుకూడా మాట్లాడ నివ్వండ'ని విజ్ఞప్తి చేశాడు. ఇది ఒకరకమైన టార్చర్‌గా అక్కడివారు భావించారు. ఇకపై ఇలాంటి ఆమెను యాంకరింగ్‌గా తీసుకురాకండి.. బాబోయ్‌ అంటూ.. నట్టికుమార్‌కు చూచాయగా చెప్పారు. ఆయన చూద్దాం.. అన్నట్లుగా మాట్లాడారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger