.
Home » » చిరు 150వ సినిమాపై మళ్లీ చరణ్ ఊరింపు

చిరు 150వ సినిమాపై మళ్లీ చరణ్ ఊరింపు

Written By Hot nd spicy on Tuesday, 27 March 2012 | 10:50

చిరంజీవి 150వ సినిమాపై ఆయన తనయుడు రామ్ చరణ్ తేజ్ మరోసారి కామెంట్ చేశారు. రచ్చ ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ...నాన్న 150 సినిమాను నేనే నిర్మిస్తా, ఆయన చేసే సినిమాలో భాగస్వామిని కావడంకంటే మించిన ఆనందం ఏముంటుంది అని వ్యాఖ్యానించారు. అవకాశం వస్తే నాన్న, పవన్ బాబాయ్‌లతో కలిసి నటించాలని ఉందని తన మనసులోని మాట బయట పెట్టాడు.

150వ సినిమా కోసం మంచి కథ కోసం అన్వేషిస్తున్నాం, కథ ఓకే అయితే వెంటనే సినిమా ప్రారంభం అవుతుందని అని గతంలో రచ్చ ఆడియో వేడుకలో చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో తమన్నా నా పక్కన హీరోయిన్‌గా బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు చిరంజీవి.

మొన్న చిరంజీవి, నిన్న రామ్ చరణ్...150వ సినిమా ప్రస్తావన తేవడంతో మెగా అభిమానుల్లో మరోసారి ఆశలు మొలకెత్తుతున్నాయి. ఈ ఇద్దరి వ్యాఖ్యలను బట్టి చూస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చిరంజీవి 150 సినిమా ఉంటుందని, కథ ఒకే అయితే మళ్లీ మెగాస్టార్‌ను త్వరలోనే తెరపై చూసుకోవచ్చనే ఊహా లోకంలో విహరిస్తున్నారు. మరి చిరంజీవి 150వ సినిమా చేసేదెన్నడో? అభిమానుల ఆశ తీరేదెన్నడో?.
Share with Friends :


Share with Friends :
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger