సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు లెక్చరర్ గా కనిపించబోతున్నారు. ఇందులో మహేష్ షర్ట్ లెస్ గా సిక్స్ ప్యాక్ బాడీతో దర్శనం ఇవ్వనున్నారనే వార్తలు కూడా వినిపించాయి. సిక్స్ ప్యాక్ బాడీ కోసం లోకల్ ట్రైనర్ ను తీసుకోవాలని భావించారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం మహేష్ బాబు ఓ ఇంటర్నేషనల్ ట్రైనర్ సమక్షంలో సిక్స్ ప్యాక్ బాడీ బిల్ట్ చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. గ్రెగ్ జానన్ రోచె అనే హాలీవుడ్ ట్రైనర్ ను ఇందు కోసం నియమించుకునే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.
మహేష్ బాబు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ బలమైన కారణం కూడా ఉందట. లోకల్ ట్రైనర్ల దగ్గర సిక్స్ బాడీ ట్రైనింగ్ తీసుకుంటే ఫేస్ లో గ్లో పోతుందని, హాలీవుడ్ ట్రైనర్ అయితే ఫేస్ లో గ్లామర్ పోకుండా పర్ ఫెక్ట్ గా ట్రైనింగ్ ఇస్తాడని ఆయన ఆలోచనగా కనిపిస్తోందని అంటున్నారు. అన్నట్లు గ్రెగ్ జానన్ రేటు ఎంతో తెలుసా? నాలుగు నెలల శిక్షణ కాలానికి రూ. 1 కోటి వరకు ఫీజు తీసుకుంటాడట. మరి ఏం జరుగబోతోందో చూడాలి.

Post a Comment