డైలాగ్ కింగ్ సాయికుమార్ ఇప్పుడు రామ్ చరణ్ కి విలన్ గా మారారు. ఆయన వంశీ పైడిపల్లి చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 13 నుంచి సెట్స్ కు వెళ్లనుంది. ఎవడు టైటిల్ తో రూపొందే ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా చేస్తోంది. అలాగే ఎమీ జాక్సన్ కూడా మరో హీరోయిన్ గా చేస్తోంది. అల్లు అర్జున్ గెస్ట్ రోల్ లో కనిపించే ఈ చిత్రం పూర్తి స్టాయి యాక్షన్ చిత్రంగా రూపొందుతుందని చెప్తున్నారు.
ఇక రామ్ చరణ్ కంటిన్యూగా సినిమాలు కమిటవుతున్నారు. ప్రస్తుతం రచ్చ చిత్రం ఫినిషింగ్ టచ్ లలో ఉన్న చరణ్ ..ప్రముఖ దర్శకుడు వివి వినాయిక్ సినిమాలోనూ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాలూ మాస్ ని టార్గెట్ చేసినవే కావటం విశేషం. ఆరెంజ్ ప్లాప్ కావటంతో రామ్ చరణ్ పూర్తిగా తన తండ్రి నటించిన సూపర్ హిట్స్ తరహా పాత్రలనే ఎంచుకోవటానికే ఆసక్తి చూపుతున్నారు. ఇక సాయికుమార్ విషయానికి వస్తే ఆ మధ్యన ఆయన విలన్ గా చేసిన ప్రస్దానం చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టింది.

Post a Comment