Pages

Friday, 3 February 2012

వింత జంతవులు.. ప్రకృతి దృశ్యాలతో "విచిత్ర దీవి"

ఆంగ్ల చిత్రం 'జర్నీ-2'ను తెలుగులో 'విచిత్ర దీవి'గా లక్ష్మీగణపతి ఫిలింస్‌ అనువదించింది. వార్నర్‌ బ్రదర్స్‌ నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రంలో డబ్ల్యు.డబ్ల్యు.ఫైటర్‌ రాక్‌ ప్రధాన పాత్ర పోషించారు. 'మిస్టీరియస్‌ ఐలెండ్‌' అనేది ఉపశీర్షిక. 3డి ఫార్మెట్‌తో పాటు 2డి ఫార్మెట్‌తోనూ ఈ చిత్రం విడుదలైంది. విశేషం ఏమంటే... యు.ఎస్‌.లో విడుదలకు వారం ముందుగానే తెలుగు, తమిళ, ఆంగ్లంలో ఆంధ్రప్రదేశ్‌లో విడుదలకావడం.

సౌత్‌ పసిఫిక్‌లోని మిస్టీరియస్‌ ఐలండ్‌ ఉంది. అందులో సేన్‌(జాన్‌ హచర్‌సన్‌) విషయాలు పుస్తకాల ద్వారా తెలుసుకుంటాడు. తన చిన్నప్పుడే తన తాత ఆ ఐలెండ్‌ శోధన కోసం వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. ఆ ప్రాంతం చాలా రిస్క్‌తో కూడినది. చిన్నతనం ఎడ్వంచర్స్‌ ఇష్టపడే సేన్‌ తన తాత అన్వేషణ కోసం పుస్తకంలో చూపిన ఐలెండ్‌ పోవడానికి సిద్ధమవుతాడు. సేన్‌ స్టెప్‌ ఫాదర్‌ రాక్‌. తెలీనితనంలో ఆవేశం వెళుతున్న అతన్ని కంట్రోల్‌ చేసి సేఫ్‌గా తెచ్చేందుకు తను వెళతాడు. అలా ఓ హెలికాప్టర్‌ను మాట్లాడుకుంటారు.

3వేల అమెరికన్‌ డాలర్లు హెలికాప్టర్‌ యజమాని తీసుకెళతానికి ముందుకు వస్తాడు. వారితోపాటు హెలికాప్టర్‌ యజమాని కుమార్తె కూడా వస్తుంది. అలా నలుగురు సముద్రం మధ్యలో రాగానే.. ఓ ప్రాంతంలో... తుఫాను వచ్చి.. గందరగోళం చేస్తుంది. దాంతో. హెలికాప్టర్‌ తునాతునకలవుతుంది. లేచేసరికి ఓ దీవిలో ఉంటారు. ఇదే విచిత్ర దీవి. అక్కడ అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు... వింత జంతువులు కన్పిస్తాయి. అక్కడ ఓ విచిత్రమైన తొండగుడ్లను తొక్కిన క్రమంలో అది దాడి చేస్తుంది. దాన్ని హ్యాంక్‌ (డ్యానీ జాన్సన్‌) వచ్చి చంపేస్తాడు. ఆయనే సేన్‌ తాత. వారికి ఆ అడవి మొత్తం చూపిస్తాడు. అక్కడ రాజభవనం ఒకటి ఉంటుంది. చాలా పురాతనమైనదది. కానీ చుట్టూ ఉన్న నీరు.. బంగారం కొండ... ఆ పక్కనే ఉన్న అగ్నిపర్వతం వల్ల అది మునిగిపోయే ప్రమాదముంది.

ఇది గ్రహించిన రాక్‌.. అక్కడ నుంచి సముద్రంలోకి దూకుతాడు. లోపల పాతకాలపు షిప్‌ ఉంటుంది. దానిద్వారా బయటకు రావాలనుకుంటాడు. ఈలోగా... ఎవరికి తెలీకుండా హెలికాప్టర్‌ యజమాని బంగారం కొండకోసం వెళతాడు. అతన్ని వెతుక్కుంటూ సేన్‌ తాత.. యజమాని ఆమె కూతురు వెళ్ళి తీసుకొస్తారు. వచ్చేటప్పుడు అగ్నిపర్వతం పేలిపోతుంది. ఆ తర్వాత వీరు ఎలా బయటపడ్డారు? తర్వాత ఏం జరిగింది? అనేది సినిమా.

సినిమా అంతా ఎడ్వంచర్‌గా ఉంటుంది. కానీ... ఎక్కడా గొప్ప ఫీల్‌ కన్పించదు. విచిత్ర ద్వీపం కోసం బయలుదేరే సన్నివేశం అనకొండలో సీన్‌ను గుర్తు చేస్తుంది. ఇక ద్వీపంలోకి వెళ్ళాక... అవతార్‌ చిత్రం గుర్తుకు వస్తుంది. ఎన్నో వింతలు విడ్డూరాలు గల ఆ చిత్రాన్ని పోల్చుకుని ఈ చిత్రం చూస్తే నిరాశ తప్పదు. తుమ్మెదలపై ప్రయాణం... వారిని పక్షులు ఛేజింగ్‌ చేయడం.. వంటి వన్నీ అవతార్‌లోనివే. 3డి ఎఫెక్ట్‌లో ఈచిత్రం థ్రిల్‌ కల్గిస్తుంది.

బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఇంట్రస్ట్‌గా ఉంటుంది. ఇంగ్లీషు సినిమాల్లో అతి తక్కువ బడ్జెట్‌ చిత్రంగా అనిపిస్తుంది. గ్రాఫిక్స్‌ ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 1000 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు వార్నర్‌ సంస్థ తెలియజేస్తుంది. కెమెరా పనితం ఇటువంటి చిత్రాలకు కీలకం. విచిత్రదీవిలో తాత పాత్రధారి ఒక్కడే అంతకాలం ఎలా ఉన్నాడనేది నిజంగా విచిత్రంగానే ఉంది.

బ్రాడ్‌ పీటర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఓ కొత్త అనుభూతినిస్తుంది. సముద్రంలోని విచిత్ర జంతువు వీరికి వెంటాడడం... వంటివి థ్రిల్‌ కల్గిస్తాయి. విద్యుత్‌ను విడుదల చేసే ఓ జంతువుతో చెడిపోయిన్‌ షిన్‌ను నడిపించే సన్నివేశం బాగుంది. ఇలా ఈ చిత్రంలో ఇంతకంటే గొప్ప సన్నివేశాలు పెద్దగా లేవు. ఇది ఏమేరకు ఆదరణ పొందుతుందో అనుమానమే.

No comments:

Post a Comment