.
Home » » ఒక్క క్షణంలో పుట్టే ప్రేమకోసం ఒక జీవితమంతా పోరాడే వాళ్ళే... :'నా ఇష్టం' రానా

ఒక్క క్షణంలో పుట్టే ప్రేమకోసం ఒక జీవితమంతా పోరాడే వాళ్ళే... :'నా ఇష్టం' రానా

Written By Hot nd spicy on Saturday, 11 February 2012 | 08:25

దగ్గుబాటి రానా, జెనీలియా హీరో హీరోయిన్లుగా ప్రకాష్‌ తోలేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'నా ఇష్టం'. యునైటెడ్‌ మూవీస్‌ పతాకంపై పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో ఒక పెద్ద ఆడియో సంస్థ ద్వారా విడుదల కానున్నాయి. చక్రి సంగీత దర్శకుడు.

ప్రమోషన్‌లో భాగంగా నగరంలోని శ్రీనిధి ఇంజనీరింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ & టెక్నాలజీ కళాశాలలో 'నా ఇష్టం' లోగో మరియు 30 సెకన్ల టీజర్‌ను విద్యార్థినీ విద్యార్థుల మధ్య విడుదల చేశారు. మూడు రోజులుగా జరుగుతున్న యూత్‌ ఉడాన్‌ ఫెస్టివల్‌లో నా ఇష్టం యూనిట్‌ పాల్గొని ఇంజనీరింగ్‌ స్టూడెంట్స్‌ను ఉత్సాహపరిచారు.

ఈ కార్యక్రమంలో హీరో రానా దర్శకుడు ప్రకాష్‌ తోలేటి, నిర్మాత పరుచూరి కిరీటి, నటులు భరత్‌, జోగినాయుడు, హర్షవర్ధన్‌, మరియం జకారియా తదితరులు పాల్గొన్నారు. లోగో, టీజర్‌ విడుదల అనంతరం రానా మాట్లాడుతూ... ఇక్కడికి వచ్చాక నా కాలేజ్‌ డేస్‌ గుర్తుకు వస్తున్నాయి. ఇదొక అందమైన ప్రేమకథ.. అందరికీ నచ్చే కథ అన్నారు.

' ఒక్క క్షణంలో పుట్టే ప్రేమకోసం ఒక జీవితమంతా పోరాడే వాళ్ళే నిజమైన ప్రేమికులు, లవర్స్‌ను సెలక్ట్‌ చేసుకోవడం కాదు లవ్‌ను సెలక్ట్‌ చేసుకోండి. దాంట్లో మీకిష్టమైన వాళ్ళుంటారు' అని డైలాగ్స్‌ చెప్పి అందరిని అలరించారు.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger