.
Home » » ‘మల్లిగాడు’గా వస్తున్న హీరో కార్తి

‘మల్లిగాడు’గా వస్తున్న హీరో కార్తి

Written By Hot nd spicy on Sunday, 26 February 2012 | 05:41

యుగానికి ఒక్కడు, ఆవారా, నా పేరు శివ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో కార్తి త్వరలో ‘మల్లిగాడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తి తమిళంలో నటించిన ‘పారుతి వీరన్’ చిత్రాన్ని తెలుగులో ‘మల్లిగాడు’ పేరుతో అనువదిస్తున్నారు.

ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా నటించింది. ప్రియమణి పోషించిన ఆ పాత్రకు జాతీయ అవార్డు కూడా దక్కింది. తమిళ టాప్ డైరెక్టర్లలో ఒకరైన అమీర్ సుల్తాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో సూర్య పల్లెటూరి యువకుడి పాత్రలో నిపించనున్నాడు.ఈ ప్రేమ కథా చిత్రంలో ప్రేక్షకుల గుండెలు పిండేసేలా ఉండే ఈ చిత్ర క్లైమాక్స్ సినిమాకు హైలెంట్ అంటున్నారు.

పారుతి వీరన్ చిత్రం తమిళనాడులో ఫిబ్రవరి 23, 2007లో విడుదలై భారీ విజయం సాధించింది. 365 రోజులు నడిచిన సినిమాగా సినిమాగా రికార్డులకెక్కింది. అప్పుడు కేవలం రూ. 5 కోట్లతో నిర్మాణమైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద రూ. 65 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రానికి ఎడిటింగ్: రాజా మహ్మద్, సినిమాటోగ్రఫీ: రామ్ జీ, సంగీతం యువన్ శంకర్ రాజా, నిర్మాత: కె.ఇ గ్నానవేల్ రాజా.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger