Pages

Wednesday, 22 February 2012

డెన్‌లో కెమెరామెన్‌‌తో రాంబాబు... చుక్కలు చూపిస్తున్న బ్రహ్మానందం!

పవన్‌ కళ్యాణ్‌ తాజాగా నటిస్తున్న చిత్రం 'కెమెరామెన్‌తో రాంబాబు'. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు. ఈ చిత్రానికి నలుగురు నిర్మాతలు. ఇందులో పవన్‌కళ్యాణ్‌ టీవీ న్యూస్‌ రిపోర్టర్‌ అని తెలిసిపోతుంది. గతంలో బంగారం సినిమాలో క్రైమ్‌ రిపోర్టర్‌గా నటించాడు. ఆ సినిమా యాభైరోజుల కొన్ని థియేటర్లలో ఆడితే ఐదు సెంటర్లలో వందరోజులు ఆడింది.

ఈమధ్య వచ్చిన సినిమాలు ఫెయిల్‌ కావడంతో...ఈ చిత్రంపై మంచి కాన్‌సన్‌ట్రేషన్‌ చేస్తున్నాడు. పూరీ జగన్నాథ్‌ దర్శకుడు కాబట్టి... ఈ చిత్రాన్ని మరింత ఛాలెంజ్‌గా తీసుకున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన విలన్‌ డెన్‌ హౌస్‌సీన్‌ను హైదరాబాద్‌లోని తార్నాకలో షూట్‌ చేస్తున్నారు. అక్కడ బ్రహ్మానందం కాంబినేషన్‌ వుంది.

బ్రహ్మానందానికి పట్టుకోవడానికి నిర్మాతలకు చుక్కలు గుర్తుకువచ్చాయి. గంటల లెక్కన ఉన్న అతని డిమాండ్‌... కొత్త నిర్మాత అయ్యేసరికి కాస్త బెట్టు చేశాడట. దీంతో ఒక్కరోజు ఆలస్యమైనా... ఆయన కోసం ఉండి మరీ డెన్‌లో సన్నివేశాలు తీస్తున్నారు. ఈ కెమెరామెన్‌ బ్రహ్మానందం గురించి ఏమంటాడో చూడాలి...

No comments:

Post a Comment