సినిమాలో కౌగిలింత సన్నివేశాల్లో నటించేందుకు తెగ మొహమాటపడే "జర్నీ" హీరోయిన్ అనన్యకి కాబోయే భర్త వెయ్యి వాట్స్ షాక్ ఇచ్చాడు. ఈ ముద్దుగుమ్మకు గతవారం పారిశ్రామికవేత్త ఆంజనేయన్‌తో నిశ్చితార్థమైంది.
అయితే పెద్దలు చేప్పిన వారినే పెళ్లి చేసుకుంటాను అన్న సంప్రదాయ కట్టుబాట్లు కలిగిన అనన్యకు వారి పెద్దలు చూసిన వ్యక్తే ఈ ఆంజనేయన్. నిశ్చితార్థం అయిన తర్వాతనే ఆంజనేయన్‌కి ఇదివరకే పెళ్లి అయ్యినట్లు అనన్య కుటుంబ సభ్యులకు ఆలస్యంగా తెలియవచ్చింది.
అంటే.. తమ కుమార్తెను రెండో భార్యగా అత్తారింటింకి పంపుతున్నామా అనే ఆశ్చర్యంతో పాటు వారు షాక్‌కు గురయ్యారు. ఆ తర్వాత తేరుకున్న అనన్య కుటుంబసభ్యులు వరుడు ఇంటివారు చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసుల విచారణలో ఆంజనేయులు ముందే పెళ్లి అయినట్లు, వివాహ రద్దు కోసం కోర్టును ఆశ్రయించినట్టు కనుగొన్నారు. తన తొలి చిత్రంలోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న అనన్యకు కూడా సాధారణ యువతుల్లానే మోసపోవడం గమనార్హం.

Post a Comment