Pages

Wednesday, 15 February 2012

రామ్ చరణ్ 'రచ్చ' రికార్డులను షేక్ చేస్తుందా..?!!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమా రచ్చ టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను షేక్ చేస్తుందట. పోకిరి రికార్డులను మగధీర హిట్‌తో రామ్ చరణ్ బ్రేక్ చేశాడు. కానీ ఆ తర్వాత వచ్చిన ఆరెంజ్ రామ్ చరణ్‌ను పూర్తిగా నిరాశపరిచింది.

ఇప్పుడు టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరో ఎవరని అడిగితే మహేష్ బాబు అని వినబడుతోంది. ఎందుకంటే మహేష్ బాబు వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్నాడు. మొన్నామధ్య వచ్చిన దూకుడు చిత్రం తర్వాత చాలా తక్కువ వ్యవధిలో తెరకెక్కించిన బిజినెస్మేన్ చిత్రం హిట్ కొట్టడంతో మహేశ్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.

ఈ నేపధ్యంలో రామ్ చరణ్ రచ్చ సినిమాను అన్ని కోణాల్లోనూ అతి జాగ్రత్తగా గమనిస్తూ, అభిమానులు మెచ్చే చిత్రంగా మలిచారట. ఈ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ పోస్టర్స్‌ను ఇటీవల చిత్ర దర్శకనిర్మాతలు విడుదల చేశారు.

No comments:

Post a Comment