.
Home » » అందుకే నా పేరు ఎన్టీఆర్ అని మార్చుకున్నా: తారకరత్న

అందుకే నా పేరు ఎన్టీఆర్ అని మార్చుకున్నా: తారకరత్న

Written By Hot nd spicy on Tuesday, 10 January 2012 | 05:15

నందమూరి వంశీయుల్లో వారసుడిగా వచ్చిన నటుడు నందమూరి తారకరత్న. మొదట్లోనే నవగ్రహాల ఆశీర్వాదంతో 9 చిత్రాలను ప్రారంభించిన ఆయన ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల చేయలేకపోయారు. మధ్యలో అడపాదడపా కొన్ని సినిమాలు చేశారు. 'అనసూయ'లో నెగెటివ్‌ షేడ్‌ ఉన్న పాత్రకు ఆయనకు నంది అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ కొంతకాలం గ్యాప్‌ తర్వాత 'నందీశ్వరుడు' అనే సినిమా చేశారు. అది సంక్రాంతికి విడుదలవుతుంది. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..

నందీశ్వరుడు అంగీకరించడానికి కారణం?
కథ.. క్యారెక్టర్‌.. దర్శకుడు శ్రీను. గత ఆరేళ్ళుగా ఆయనతో బాగా స్నేహం. అప్పుడే సినిమా చేయాలనుకున్నాం. కుదరలేదు. ఈ కథ బాగా నచ్చింది. మీరు చేస్తేనే చేస్తానని.. నా కోసం వెయిట్‌ చేశాడు. అది బాగా నచ్చింది. కమిట్‌మెంట్‌ ఉన్న దర్శకుడు. చాలామంది చెప్పడం, చేయడంలో తేడా చూపిస్తారు. శ్రీను మాత్రం తను చెప్పింది చెప్పినట్లు తీశాడు. నిర్మాతలకు కూడా సీన్‌ టు సీన్‌ చెప్పి ఒప్పించాడు. ఆగస్టు 25న షూటింగ్‌ ప్రారంభించి మూడు నెలలో పూర్తి చేశాం.

రీమేక్‌ కథనే చేయడానికి కారణం?
రీమేక్‌ అంటే మొత్తం కథంతా కాదు. దర్శకుడు శ్రీను ఎప్పుడో రాసుకున్న కథ.. అది ఓ నిర్మాతకు వినిపించాక... కన్నడ సినిమా 'డెడ్లీసోమా' కాన్సెప్ట్‌తో ఉందని చెప్పారట. వెంటనే ఆయన సినిమా చూసి.... నా కథ సింక్‌ అవుతుందని... వెంటనే చాలా మార్పులు చేశారు. అందుకే అందులోని గెటప్‌ ఇందులో పెట్టారు. కథంతా హైదరాబాద్‌లో సాగుతుంది.

హైదరాబాద్‌లో.. మీసాలు పెంచి కత్తులు పట్టుకునే సంప్రదాయం లేదుకదా?
రొటీన్‌కంటే.. కాస్త కొత్తగా ఉండాలని దర్శకుడు ఆలోచనల్లోంచి వచ్చిన గెటప్‌ ఇది. ఏదో కొత్తదనం చూపాలని చేసింది. నిజంగా హైదరాబాద్‌లో అలా వుండదు. కానీ కథలో ట్రావెల్‌ అయ్యాక... మీకు ఆ పాత్ర నచ్చుతుంది.

జగపతిబాబు పాత్ర ఎలా ఉంటుంది?
జగపతిబాబు పవర్‌ఫుల్‌ పోలీసు ఆఫీసర్. ఆయనతో నటించడం చాలా హ్యాపీగా ఉంది. సీనియర్‌ నటుడు, ఇగో లేని మనిషి. కొన్ని సీన్లలో డీగ్రేడ్ చేసుకుని నటించారు.

మీ పాత్ర ఏమి చేస్తుంది?
కాలేజీ కుర్రాడి కథ. కాలేజీ అయ్యాక. అతని జీవితంలో ఏర్పడిన పరిస్థితులు. నా తల్లిదండ్రులుగా సీత, సుమన్‌ నటించారు. తండ్రి కోరిక మేరకు సమాజం కోసం కొడుకు ఏం చేశాడు అన్నది పాయింట్‌. డిఫరెంట్‌ స్క్రీన్‌ప్లే.

ఇదివరకు లేనిది ఇప్పుడు ఎన్‌.టి.ఆర్‌. అనే పేరు పెట్టుకోవడానికి కారణం?
న్యూమరాలజీ ప్రకారం అలా ఉండాలని చెప్పారు. ఏదో నన్ను ఎన్‌.టి.ఆర్‌. అని పిలవాలని కాదు. జనరల్‌గా అందరూ నన్ను తారక్‌ అంటుంటారు. ఎన్‌.టి.ఆర్‌.అన్నా ఓకే.

అమరావతి లాంటి పాత్ర చేస్తారా?
తప్పకుండా.. ఆ పాత్ర నెగెటివ్‌ అన్నా అందులో పాజిటివ్‌ దృక్పథం ఉంది. అటువంటి పాత్రలు చేస్తేనే బ్రేక్‌ వస్తుంది.

1వ నెంబర్‌ కుర్రాడు నుంచి నందీశ్వరుడు వరకు మీ కెరీర్‌ చూస్తే ఏమనిపిస్తుంది?
చాలా ఎత్తుపల్లాలు ఉన్నాయి. జరిగిపోయింది జరిగింది. దాని గురించి ఆలోచించవద్దని బాబాయ్‌ చెబుతుంటారు. నీ ప్రయత్నం నువ్వు సిన్సియర్‌గా చేయి. ఫలితం అదే వస్తుందనేవారు. సాఫీగా సాగే రోడ్డుపై స్పీడ్‌ బ్రేకర్లు ఉన్నట్లే.. జీవితంలో ఉంటాయని ఎప్పుడూ చెబుతుంటారు.

సంక్రాంతికి బాబాయ్‌ వచ్చేవారు. ఈసారి మీరు వస్తున్నారు?
అవును... ప్రతి సంక్రాంతికి ఉండేది. ఈ సంక్రాంతికి నందమూరి వంశంలో ఎవరో ఒకరి సినిమా రావాలని అనుకున్నాం. బాబాయ్‌ అధినాయకుడు ఫిబ్రవరికి వెళ్ళింది. ఎవరిదీ లేదు. అందుకే నేను వచ్చాను. నేను కాకుండా వెంకటేష్‌, మహేష్ బాబు సినిమాలు వస్తున్నాయి. అవన్నీ సక్సెస్‌ కావాలి.

ఇంతకీ డేట్‌ ఎనౌన్స్‌ చేయలేదు?
సంక్రాంతి అనుకున్నాం.. ఆ రెండు సినిమాలు డేట్స్‌ మారడంతో మా సినిమా కూడా కాస్త మారాల్సి వచ్చింది. ఈనెల 15న ఆదివారం నందీశ్వరుడు విడుదలవుతుంది.
Share this article :

Post a Comment

 
Support : Creating Website | Shashank's AndhraHitz | AtoZ Music
Copyright © 2011. Andhra Hitz..... - All Rights Reserved
Template Created by Creating Website Published by Shashank's AdhraHitz
Proudly powered by Blogger